Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభTollywood hero in Federation league: ఫెడరేషన్ లీగ్‌లో మన హీరో

Tollywood hero in Federation league: ఫెడరేషన్ లీగ్‌లో మన హీరో

ఈ హీరో బాస్కెట్ బాల్ ప్లేయర్

ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన హీరో అరవింద్ కృష్ణ.

- Advertisement -

టాలీవుడ్‌లో హీరోగా తనదైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఓ సూపర్ హీరో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో అరవింద్ కృష్ణ షూటింగ్‌లో పాల్గొంటూనే షెడ్యూల్ బ్రేక్స్‌లో ఎంతో ప్రెస్టీజియస్‌ ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ (FIBA) లీగ్‌లో పాల్గొన్నారు. FIBA జపాన్‌లో గత వారం సాగామిహర 3BL లీగ్‌ను (ఇందులో ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌ పాల్గొంటారు) . ఇందులో హైదరాబాద్ పాల్గొనగా, ఆ టీమ్‌కి అరవింద్ కృష్ణ కెప్టెన్‌‌గా వ్యవహరించారు. బల్లా కొయటె, టకహారు సౌగవా, మయొరి వంటి దేశాల నుంచి కూడా పలు టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఈ క్రమంలో అరవింద్ కృష్ణ టీమ్ క్వాలిఫైయర్స్‌కి ఎంపికైంది. ఈ లీగ్‌లో తదుపరి గేమ్స్‌ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు.

ఈ చాంపియన్ లీగ్‌లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణ కావటం విశేషం. ‘‘క్రికెట్‌లో పొట్టి క్రికెట్ ఐపీఎల్ తరహాలో బాస్కెట్ బాల్‌లో 3BL లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ముగ్గురు ప్లేయర్స్ తో పాటు ఓ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఉంటారు. ఇలాంటి ప్రెస్టీజియస్ చాంపియన్ షిప్‌లో పాల్గొనటం ఎంతో గొప్పగా, గర్వంగా, గౌరవంగా ఉంది. నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ నేపథ్యంలో 3BL లీగ్‌లో పాల్గొనటం నాకు మంచి బ్రేక్ అనొచ్చు. ఇది ఎంతో ఎనర్జీనిస్తుంది ’’ అని అరవింద్ కృష్ణ పేర్కొన్నారు.

ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన అరవింద్ ఓ వైపు సినిమాలు, మరో వైపు స్పోర్ట్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ‘‘నా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో ఎంతగానో ఉపయోగపడింది. అలాగే నా కెరీర్ మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపింది’’ అని తెలిపారు అరవింద్ కృష్ణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News