Nidhhi Agerwal: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రశంసలు కురిపించింది. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ అన్నది. గత ఏడాది పవన్ కళ్యాణ్‌తో హరిహరవీరమల్లు సినిమా చేసింది నిధి అగర్వాల్.. ఇటీవల రిలీజైన ప్రభాస్ రాజాసాబ్‌లో ఓ హీరోయిన్‌గా కనిపించింది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడింది. తన గ్లామర్ మెరుపులతో పాటు యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. అయినా ఆమె కష్టం వృథాగానే మారింది. హరిహరవీరమల్లుతో పాటు రాజాసాబ్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెటిలైపోవాలనే నిధి అగర్వాల్ ఆశలు తీరలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పై నిధి అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. “పవన్ కళ్యాణ్‌లో ధైర్యం ఎక్కువని, సమస్య ఏదైనా వెనకగుడు వేయరు. ఓ సింహం లాగానే ఒంటరిగా పోరాటాన్ని చేస్తుంటారు. ఎప్పుడూ న్యాయంవైపే నిలబడతారు.. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని తాను ఇప్పటి వరకు చూడలేదు” అని నిధి అగర్వాల్ అన్నది.
Also Read – Naveen Polishetty: హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన నవీన్ పొలిశెట్టి
“చాలా ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజలకు పవన్ కళ్యాణ్ సేవ చేస్తున్నారు. చాలా కష్టపడి తన పార్టీని డెవలప్ చేశారు. పవన్ కళ్యాణ్‌లోని లీడర్‌షిప్ క్వాలిటీస్, ప్రజలు, దేశం పట్ల ఆయనకు ఉన్న నిబద్దత చూస్తుంటే ఏదో ఒక రోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదని” నిధి అగర్వాల్ అన్నది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రభాస్‌పై కూడా తెగ పొగడ్తలు కురిపించింది నిధి అగర్వాల్. ప్రభాస్ చాలా జెన్యూన్‌గా ఉంటాడని, అతడి దగ్గర పాలిటిక్స్, పీఆర్ గేమ్స్ లాంటివేవి ఉండవని అన్నది. హిట్టు, ఫ్లాప్‌లను పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకేలా కనిపిస్తారని అన్నది. రాజాసాబ్ తర్వాత ఓ హారర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది నిధి అగర్వాల్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో నిధి అగర్వాల్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
Also Read – Ashika Ranganath: మళ్ళీ సంక్రాంతికి రెడీ అవుతున్న గ్లామర్ బ్యూటీ!

