Tuesday, February 10, 2026
Homeచిత్ర ప్రభTollywood Heroes: పరభాషా దర్శకులను నమ్మొద్దు...

Tollywood Heroes: పరభాషా దర్శకులను నమ్మొద్దు…

Tollywood Heroes: పర భాషా దర్శకులను నమ్మడంలో తప్పు లేదు. కానీ, పూర్తిగా వాళ్లనే అన్నీ నమ్మకాలు, ఆశలు పెట్టుకోవడం ఖచ్చితంగా సరిదిద్దుకోలేని తప్పులే. గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్స్ అయిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్స్ కోసం ఆరాటపడుతున్నారు. కానీ, మనవాళ్ళు మాత్రం కనీసం హిందీ దర్శకుల గత చిత్రాల ట్రాక్ రికార్డ్ ని కూడా చూడకుండా బాలీవుడ్ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అత్యంత దారుణం.

- Advertisement -

బాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్మి డేట్స్ ఇస్తే వాళ్ళు మన హీరోలకి డిజాస్టర్ ని అంటగడుతున్నారు. గతంలో రామ్ చరణ్ మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హిందీ దర్శకుడు అపూర్వ లఖియాకి ఓకే చెప్పడం.. వీరి కాంబినేషన్ లో జంజీర్ లాంటి డిజాస్టర్ రావడం అందరికీ తెలిసిందే. 2013లో సోషల్ మీడియా ఇంత ఉదృతంగా లేకపోయినపోయినప్పటికీ ముంబై మీడియాలో మాత్రం మన రాం చరణ్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తూ వార్తలను ప్రసారం చేశారు.

Also Read – Independence Day : స్వాతంత్ర దినోత్సవం: రోహిత్ శర్మ పోస్టుతో జెండా రెపరెప!

పాన్ ఇండియా వైడ్ గా బాహుబలి సిరీస్ తో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ విషయంలో ఇదే జరిగింది. తానాజీ లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు ఓం రౌత్ ట్రాక్ రికార్డ్ చూసి ప్రభాస్ ఏమాత్రం ఆలోచించకుండా రాముడిగా నటించేందుకు సైన్ చేశాడు. ఆదిపురుష్ గా వచ్చిన ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. వసూళ్ల పరంగా కూడా గట్టి షాక్ తగిలింది. ఇక ఈ వారం వచ్చిన వార్ 2 కూదా ఇదే లిస్ట్ లో చేరింది. కాలర్ ఎగరేసి మరీ హైప్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని చూసి సినిమాకెల్తే కళ్లు బైర్లు కమ్మాయి అంటున్నారు.

వార్ చిత్రాన్ని తీసిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాకుండా వార్ 2 ని అయాన్ ముఖర్జీకి ఇవ్వడం ఎంత పెద్ద తప్పో సినిమా చూశాక గానీ అర్థం కాలేదు. అసలు కంటెంట్ ఏమీ లేకుండా 6 ఫైట్లు పెడితే సినిమా హిట్ అవుతుందా..? అని అందరూ ఏకిపారేస్తున్నారు. తన పాత్రకున్న నెగటివ్ షేడ్ కూడా అర్థం చేసుకోకుండా, కేవలం హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అనగానే తారక్ ఎగ్జైట్ అయి వార్ 2 చేసి షాక్ తిన్నాడు పాపం. నార్త్ రివ్యూయర్స్ అయితే సినిమా డిజాస్టర్ అని ఎడాపెడా రాసేస్తున్నారు. పైన చెప్పుకున్న మూడు ఉదాహరణల్లో బాలీవుడ్ హీరోలను నమ్మడం మన టాలీవుడ్ హీరోల తప్పే అంటున్నారు.

Also Read – Humanoid Robot Games 2025 : చైనాలో రోబో ఒలింపిక్స్.. మరమనుషుల క్రీడా సంబరం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News