Homeచిత్ర ప్రభTollywood: 'కొత్త బంగారులోకం' హిట్ పెయిర్ తో 'నా వైఫ్ మిస్సింగ్'

Tollywood: ‘కొత్త బంగారులోకం’ హిట్ పెయిర్ తో ‘నా వైఫ్ మిస్సింగ్’

Tollywood: ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో కొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ త్వరలో ఆహా ఒరిజినల్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. ప్రతి కేసుకు ఒక కథ ఉంటుంది, ఈ కేస్ లో నిజం ఏంటి అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది ఆహా. తన భార్య మిస్సయ్యిందంటూ ఇందులోని కథానాయకుడు వరుణ్ సందేశ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడాన్ని గతంలో రివీల్ చేసింది ఆహా. ఇప్పుడా కేసులో ఉన్న నిజం ఏంటో సిరీస్ లో చూడాలనే క్యూరియాసిటీ ఆడియెన్స్ లో క్రియేట్ అవుతోంది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. కొత్త బంగారులోకం వంటి సూపర్ హిట్ సినిమా చేసిన పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News