టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి(KP Chowdary) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాగా 2023లో దొరికిన డ్రగ్స్ కేసులో KP చౌదరి పేరు బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇండస్ట్రీలో పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలిందని వార్తలు కూడా వచ్చాయి. విచారణలో పలువురి సెలబ్రెటీల పేర్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఈ కేసు గురించి ఎక్కడా వినపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా KP చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనగా మారింది.
గతంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కేపీ చౌదరి మృతిపై సురేఖవాణి కుమార్తె సుప్రీత ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను, అన్న నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నీ బాధలు నేను వినడానికి లేకుండా చేసావు కదా అన్న.. నీకు ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నా, దయచేసి వెనక్కి వచ్చేయ్ అన్న. మిస్ యు కెపి అన్న. నువ్వు ఎక్కడున్నా టైగర్ అంటావుగా. ఐ లవ్ యు సో మచ్ అన్న. రెస్ట్ ఇన్ పీస్ అన్న” అంటూ భావోద్వేగానికి గురైంది.