Homeచిత్ర ప్రభTheaters and OTT Movies: ఈ వారం థియేట‌ర్ల‌లో డ‌బ్బింగ్ సినిమాల‌దే హ‌వా - ఓటీటీలో...

Theaters and OTT Movies: ఈ వారం థియేట‌ర్ల‌లో డ‌బ్బింగ్ సినిమాల‌దే హ‌వా – ఓటీటీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ సంద‌డి

Theaters and OTT Movies: ప్ర‌తి ఏడాది ద‌స‌రాకు స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేవి. ఈ సారి మాత్రం పండుగ క‌ళ త‌ప్పింది. ద‌స‌రాకు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా తెలుగు స్ట్రెయిట్ సినిమా రిలీజ్ కావ‌డం లేదు. రెండు డ‌బ్బింగ్ మూవీస్‌ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి.

- Advertisement -

కాంతార చాప్ట‌ర్ వ‌న్‌
రిష‌బ్‌ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాంతార చాప్ట‌ర్ వ‌న్ మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంది. కాంతార మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు 125 కోట్ల బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. తెలుగులో మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంతార చాప్ట‌ర్ వ‌న్‌ను రిలీజ్ చేస్తోంది. తెలుగులో కాంతార సీక్వెల్ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌భాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ పాల్గొన‌డంతో ఈ డ‌బ్బింగ్ మూవీపై ఆస‌క్తి ఏర్ప‌డింది. కాంతార పార్ట్ వ‌న్ తెలుగులో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. సీక్వెల్ కూడా అదే స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో లేదో మ‌రో నాలుగు రోజుల్లో డిసైడ్ కాబోతుంది.

Also Read- Chiranjeevi Tilak Varma Asia Cup 2025 : ఆసియా కప్ 2025 విజయంపై తిలక్ వర్మకు మెగాస్టార్ స్పెషల్ ప్రశంసలు

ధ‌నుష్ ఇడ్లీ కొట్టు…
కాంతార చాప్ట‌ర్ వ‌న్‌తో ఈ పాటు ఈ వారం ధ‌నుష్ ఇడ్లీ కొట్టు మూవీ బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌బోతుంది. కాంతార సీక్వెల్‌తో పోలిస్తే ప్ర‌మోష‌న్స్‌తో పాటు హైప్ ప‌రంగా ఇడ్లీకొట్టు వెనుక‌బ‌డి ఉంది. ధ‌నుష్‌తో పాటు నిత్యామీన‌న్‌కు తెలుగులో క్రేజ్ ఉండ‌టం ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిల‌వ‌నుంది. ఇడ్లీకొట్టు మూవీకి ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

థియేట‌ర్ల‌లో అంత‌గా సంద‌డి లేక‌పోయినా ఓటీటీలో మాత్రం ఈ వారం ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి.

లిటిల్ హార్ట్స్‌…
ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించిన లిటిల్ హార్ట్స్ మూవీ అక్టోబ‌ర్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. మౌళి త‌నూజ్‌, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా న‌టించిన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో న‌ల‌భై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లిటిల్ హార్ట్స్ మూవీకి సాయి మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

శివ‌కార్తికేయ‌న్ మ‌ద‌రాసి…
శివ‌కార్తికేయ‌న్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌ద‌రాసి ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టించారు.

శ్రీలీల జూనియ‌ర్‌
శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన జూనియ‌ర్ మూవీ ఆహా ఓటీటీ ద్వారా సెప్టెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న‌యుడు కిరీటి హీరోగా న‌టించాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో యావ‌రేజ్‌గా నిలిచింది.

Also Read- Ram Charan: గేమ్ ఛేంజ‌ర్ ఎఫెక్ట్ – గ్లోబ‌ల్ స్టార్ నుంచి మ‌ళ్లీ మెగా ప‌వ‌ర్ స్టార్‌గా మారిన రామ్‌చ‌ర‌ణ్‌

నెట్‌ప్లిక్స్
ది గేమ్ వెబ్ సిరీస్ – అక్టోబ‌ర్ 2
ఇఫ్ మూవీ _ అక్టోబ‌ర్ 2

సోనీ లివ్
థ‌ర్జీన్ వెబ్ సిరీస్ – అక్టోబ‌ర్ 1

స‌న్ నెక్స్ట్‌
సాహ‌సం (క‌న్న‌డ ) మూవీ _- అక్టోబ‌ర్ 1
గౌరీ శంక‌ర (క‌న్న‌డ ) – అక్టోబ‌ర్ 1

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News