Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభJAAT: జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో 'జాట్' ఫ‌స్ట్ సాంగ్‌ విడుదల

JAAT: జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ‘జాట్’ ఫ‌స్ట్ సాంగ్‌ విడుదల

తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని ‘వీరసింహా రెడ్డి’ తర్వాత బాలీవుడ్‌లో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ హీరోగా సయామీ ఖేర్, రెజీనా కథానాయికలుగా ‘జాట్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. గోపిచంద్ మాస్ స్టైల్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ టచ్ కియా అంటూ సాగే పాటను విడుదల చేశారు.

- Advertisement -

ఈ పాటలో హాట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా వేసిన స్టెప్పులు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ సాంగ్‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేయ‌గా ప్రముఖ సంగీత దర్శకుడు త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News