Tovino Thomas: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందుతోంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి తరచూ ఏదోక రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అయితే ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు టొవినో థామస్ కీ రోల్ పోషించనున్నాడనే వార్తలు వినిపించాయి. ఇందులో ఓ పాత్ర కోసం డైరెక్టర్ అతడిని సంప్రదించి తన పాత్రను వివరించారు.
డ్రాగన్ లో కీ రోల్?
తనకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే డ్రాగన్ సెట్‌లో అతడు అడుగుపెడుతున్నాడంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇక డ్రాగన్‌లో నటించడంపై తాజాగా టొవినో థామస్ క్లారిటీ ఇచ్చారు. తన తాజా చిత్రం ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అతడు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చిత్రాల అప్‌డేట్ ఇచ్చాడు. అలాగే డ్రాగన్‌లో తను నటించడం లేదని కూడా స్పష్టం చేశాడు.
టొవినో థామస్ క్లారిటీ
అతడు మాట్లాడుతూ.. “తెలుగులో సినిమాల్లో నటించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. కానీ, అది కుదరడం లేదు. మాలయాళంలో ఒకేసారి రెండు మూడు చిత్రాలు చేయడం వల్ల అది కుదరడం లేదు. ఎందుకంటే మలయాళం చిత్రాల వర్కింగ్ కల్చర్‌కి టాలీవుడ్ వర్కింగ్ కల్చర్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. మలయాళంలో తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేస్తాం. కానీ, తెలుగులో అలా కాదు. తెలుగు సినిమాల షూటింగ్ షెడ్యూల్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. ఒక మూవీ పూర్తయ్యాకే మరో సినిమా చేస్తాను. ఒకవేళ ఒక తెలుగు సినిమాకి కమిటైతే.. ఒకేసారి మలయాళంలో నా రెండు మూడు చిత్రాలపై ప్రభావం పడుతుంది. అందుకే తెలుగులో నటించలేకపోతున్నా” అని చెప్పకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
Also Read: DSP: షాకింగ్.. హరీష్ శంకర్‌ని అన్‌ఫాలో చేసిన దేవిశ్రీ.. అసలేం జరుగుతుంది!
15 ఏళ్లలో 55 చిత్రాలు
అనంతరం తన 15 ఏళ్ల కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 55కిపైగా సినిమాల్లో నటించానని చెప్పాడు. మొదట్లో ఇతర హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేవాడినని గుర్తు చేసుకున్నాడు. 2014లో నేను లీడ్‌రోల్ చేసిన మూవీ విడుదలైంది. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూనే ఉన్నా. ఒకవేళ హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయి ఉంటే ఇన్ని సినిమాలు వచ్చి ఉండేవి కాదని పేర్కొన్నాడు. కాగా టొవినో థామస్ ప్రధాన పాత్రలో డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కిన ‘పళ్లిచట్టంబి’ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతుండటం విశేషం.

