Tovino Thomas Nadikar OTT Update :మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌజ్‌గా కొనసాగుతోంది. పుష్ప 2 మూవీతో గత ఏడాది భారీ బ్లాక్‌బస్టర్‌ను దక్కించుకున్నారు మైత్రీ నిర్మాతలు. ఈ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గత ఏడాది మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. నడికర్ అనే కామెడీ డ్రామా మూవీని ప్రొడ్యూస్ చేసింది.
టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీతో మలయాళంలో పాగా వేయాలని మైత్రీ నిర్మాతలు గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ సినిమా రిజల్ట్ రూపంలో వారికి ఊహించని షాక్ తగిలింది. నడికర్ గత ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఐదు కోట్ల కలెక్షన్స్…
దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి వారంలోనే థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. డిజాస్టర్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమాను కొనడానికి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవి ముందుకు రాలేదు. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నడికర్ మూవీ సైనా ప్లే ద్వారా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
నడికర్ స్టోరీ ఏంటంటే?
డేవిడ్ పడిక్కల్ (టోవినో థామస్) హీరోగా నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్‌గా నిలుస్తాయి. ఈ విజయాలతో స్టార్‌గా మారిపోతాడు. డేవిడ్‌లో గర్వం పెరగుతుంది. డేవిడ్‌కు యాక్టింగ్ రాదంటూ ఓ సీనియర్ డైరెక్టర్ విమర్శిస్తాడు. తన నటనతో అతడిని మెప్పిస్తానంటూ డేవిడ్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? డేవిడ్‌కు యాక్టింగ్ ట్రైనర్‌గా వచ్చింది ఎవరు? తన తప్పును డేవిడ్ ఎలా తెలుసుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్…
నడికర్ మూవీకి లాల్ జూనియర్ దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీతో మలయాళంలో ఫేమస్ అయ్యాడు లాల్ జూనియర్.