Trisha indirectly responds to rumors: తమిళనాడు సీఎం విజయ్‌తో నటి త్రిష రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినీ, రాజకీయ రంగాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కడం.. అనంతరం విజయ్ ఓ వివాహ వేడుకకు త్రిషతో కలిసి హాజరవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో, వీరిద్దరి మధ్య బంధంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది ఈ జంట. అయితే, వీరిద్దరూ ఎప్పుడూ ఈ రూమర్స్‌పై స్పందించనప్పటికీ.. అవి మాత్రం ఆగడం లేదు. కాగా, సాధారణంగా ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించని త్రిష తాజాగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను’ అని రాసుకొచ్చారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ.. తనపై రూమర్స్ క్రియేట్ చేస్తోన్న వారి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెట్టినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: TGSPC: నిరుద్యోగులకు ఆవిర్భావ దినోత్సవ కానుక.. 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
హాట్ టాపిక్‌గా త్రిష, విజయ్ రిలేషన్..
ఇక, త్రిష గత నెలలోనూ ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టారు. ఈ నెల మొదట్లో.. ‘నాకు ఇష్టమైన మంత్ వచ్చేసింది’ అని పెట్టిన ఆమె.. తాజాగా ‘ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా నా ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుంది’ అని కొన్ని ఫొటోలు షేర్ చేశారు. దీనికి ‘మ్యాజికల్ మే’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నెలలోనే త్రిష పుట్టినరోజు ఉండడం, అదే రోజు విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. దానితో పాటు ఆమె నటించిన ‘కరుప్పు’ హిట్‌గా నిలిచి రూ. 348 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దీంతో, తమిళనాడు సీఎం విజయ్, త్రిష రిలేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూమర్స్‌పై ఎప్పుడు పుల్‌స్టాప్ పెడతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

