Sunday, September 8, 2024
Homeచిత్ర ప్రభAamir Khan : హిందువుగా మారి మాజీ భార్యతో బాలీవుడ్ స్టార్ పూజలు.. ట్రోల్ చేస్తున్న...

Aamir Khan : హిందువుగా మారి మాజీ భార్యతో బాలీవుడ్ స్టార్ పూజలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

- Advertisement -

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలనే చూస్తున్నాడు. చాలా గ్యాప్ తీసుకొని లాల్ సింగ్ చద్దా సినిమాతో వచ్చినా అది కూడా ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్ళు సినిమాలకి గ్యాప్ ఇస్తాను అని చెప్పాడు. అప్పట్నుంచి అమీర్ ఖాన్ ఎక్కువగా కనపడట్లేదు. ఇటీవల తన కూతురు ఐరాఖాన్ నిశ్చితార్థం జరగగా అప్పుడు ఒకసారి కనపడ్డాడు, మళ్ళీ కనపడలేదు.

తాజాగా అమీర్‌ఖాన్ సరికొత్త గెటప్ లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గతంలో అమీర్ ఖాన్ హిందువులకి, ఇండియాకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. అప్పుడు అందరూ అమీర్ ని దారుణంగా ట్రోల్ చేశారు. పలుమార్లు తన సినిమాలలో కూడా హిందువులపై నెగిటివ్ గా చూపించి విమర్శల పాలయ్యాడు అమీర్. అయితే తాజాగా తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి తన ఆఫీస్ లో హిందూ సంప్రదాయంలో పూజలు చేశాడు.

ఈ ఫొటోలు బయటకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయి అమీర్ ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోలో అమీర్‌ఖాన్ బొట్టు పెట్టుకొని, కండువా వేసుకొని, చేతికి కంకణం కట్టుకొని, కలశం పట్టుకొని ఉన్నాడు. అమీర్‌ఖాన్ ఇలా హిందువులాగా మారి పూజ చేయడంతో, అది కూడా మాజీ భార్యతో కలిసి పూజ చేయడంతో నెటిజన్లు మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఈ కొత్త వేషం ఎందుకు, ఎన్ని చేసినా నీ సినిమాలు ఆడవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News