Homeచిత్ర ప్రభMANN-PISHACH: ఐఫోన్‌లో షూటింగ్‌.. రూ. ౩౩ వేల బడ్జెట్‌తో సినిమా.. 'తుంబాడ్‌' దర్శకుడి ప్రయోగం అదిరింది

MANN-PISHACH: ఐఫోన్‌లో షూటింగ్‌.. రూ. ౩౩ వేల బడ్జెట్‌తో సినిమా.. ‘తుంబాడ్‌’ దర్శకుడి ప్రయోగం అదిరింది

MANN-PISHACH Movie Trailer: ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాకైనా కోట్లలో బడ్జెట్‌ పెడుతున్నారు. ఇక పాన్ ఇండియా మూవీ అయితే కనీసం రూ. 200 నుంచి రూ. ౩౦౦ కోట్ల బడ్జెట్‌ కేటాయించాల్సి వస్తుంది. చిన్న సినిమా అయినా ఐదారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. ౩౩ వేలతో ఓ సినిమాని తెరకెక్కించాడు ఓ డైరెక్టర్‌. షార్ట్‌ ఫిలింకి సైతం లక్షలు ఖర్చు చేస్తున్న టైంలో ఓ డైరెక్టర్‌ కేవలం రూ. ౩౩ వేలతో సినిమా రూపొందించాడు. ఆయన మరెవరో కాదు రాహి అనిల్‌. రూ. ౩౩ వేలతో 80 నిమిషాల నిడివితో మూవీ తెరకెక్కించిన ప్రమోగం చేశాడు.

- Advertisement -

మార్చి 18న విడుదల
ఏఐ సాయంతో మంచి విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూపించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో కేవలం ఇద్దరు నటులు మాత్రమే నటించడం విశేషం. తుంబాడ్, మంఝా, మాయాసభ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు డైరెక్టర్‌ రాహి అనిల్. ఆయన తెరకెక్కించిన తుంబాడ్‌ ఎంతటి విజయం సాధించేందో ప్రత్యేకంగా చెప్పనవసంర లేదు. అలాగే మంఝూ, మాయసభ చిత్రాలు కూడా భారీ విజయం సాధించాయి. అదే సైకలాజికల్‌ థ్రిల్లర్‌తో ఆయన మన్‌ పిశాచ్‌ పేరుతో మరో సినిమా రూపొందించాడు. మార్చి 18న సైకాలజికల్ హారర్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ చిత్రం యూట్యూబ్‌ మాత్రమే విడుదల కానుంది.

కేవలం ఇద్దరే నటులు?
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కేవలం ఇద్దరు నటులు(యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే) మాత్రమే కనిపించారు. చూస్తుంటే వీరిద్దరితోనే సినిమా మొత్తాన్ని నడిపించాడు అనిపిస్తోంది. ఇక మూవీని ఐఫోన్‌ కెమెరాతో వీడియో తీసి.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ బడ్జెట్‌తో తీర్చిదిద్దారు. ‘ఇది నా కొత్త ప్రయోగం. సాంకేతికత ఎలా సినిమాలను మారుస్తుందో చూపించాలని కోరికతో ఈ చిత్రాన్ని రూపొందించాను’ అని డైరెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ‍ప్రభావం సినిమా రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఫోన్ కెమెరాలో తీసిన ఏఐ విజువల్స్‌ బాగానే అనిపిస్తున్నాయి. ఇది తెలిసి నెటిజన్స్‌ ఐఫోన్, ఏఐతో దర్శకుడు ప్రయోగం కాదు అద్భుతమే చేశాడంటున్నారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ 42 ప్రోటోకాల్‌ నిజమేనా.. ఇదిగో ప్రూవ్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News