నటసింహం బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable S4) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేశ్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హాజరై పలు విశేషాలను బాలయ్యతో పంచుకున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కొత్త ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రచారంలో భాగంగా అన్ స్టాపబుల్ సెట్స్‌లో చెర్రీ సందడి చేశారు.
ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)కు చరణ్ కాల్ చేసి ఆటపట్టిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గతంలో ఈ షోకు ప్రభాస్ వచ్చినప్పుడు చరణ్‌కి బాలకృష్ణ ఫోన్ చేసి ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతారు. దీంతో ‘నువ్వు కూడా ఈ షోకు వచ్చి నాకు కాల్ చేస్తావ్ కదా అప్పుడు చెబుతా నీ సంగతి’ అని ప్రభాస్ చరణ్‌కి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. అన్నట్లుగానే చెర్రీ ఈ షోకు రావడం డార్లింగ్‌కి ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.