Sunday, March 8, 2026
Homeచిత్ర ప్రభPawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ కాదు.. ఒరిజినల్: స్పష్టం చేసిన హరీశ్ శంకర్

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు.. ఒరిజినల్: స్పష్టం చేసిన హరీశ్ శంకర్

Ustaad Bhagat Singh is a original film: పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని తెరకెక్కిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ చిత్రం రీమేక్ కాదని, పూర్తిగా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిన స్ట్రెయిట్ ఫిల్మ్ అని స్పష్టం చేశారు. గతంలో ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ హిట్టయిన విషయం, అది సల్మాన్ ఖాన్ సినిమా ‘దబాంగ్‌’కు రీమేక్ అనే సంగతి తెలిసిందే.

- Advertisement -

కాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ మొదలైనప్పట్నుంచీ ఇది విజయ్ నటించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘తెరి’కి రీమేక్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఆ ప్రచారాన్ని ఖండించాడు హరీశ్ శంకర్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన ఆయన “ఉస్తాద్ భగత్ సింగ్ ఒరిజినల్ ఫిల్మ్. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో అగ్రెసివ్ కాప్ పాత్రలో కనిపిస్తారు. దీనికి ‘తెరి’తో ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశాడు.

ఇదే సందర్భంగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడాయన. “గబ్బర్ సింగ్‌లో నేను మార్పులు చేసి క్రెడిట్స్ తీసుకున్నాను. కానీ ఈ సినిమాకు (‘ఉస్తాద్‌’కు) స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ నేనే రాశాను. ‘తెరి’లోని కొన్ని ఎపిసోడ్‌లు నా ‘గబ్బర్ సింగ్’ నుంచి ప్రేరణ పొందాయి. అలాంటి సినిమాను నేనెందుకు రీమేక్ చేస్తాను?” అని ప్రశ్నించారు. ‘ఉస్తాద్‌’కు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ క్రెడిట్స్ తనవేనని ఆయన చెప్పారు.

Ustaad Bhagat Singh: అప్పుడు చిరు – ఇప్పుడు ప‌వ‌న్‌ – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో ఇళ‌య‌రాజా పాట‌

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మార్చి 26న విడుదలవుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు. ‘తెరి’కి, ‘ఉస్తాద్‌’కు ఉన్న పోలికలు.. రెండింటిలోనూ హీరో పోలీసాఫీసర్, రెండు సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండటం. ‘ఉస్తాద్’ రిలీజైతే కానీ, ఆ రెండు సినిమాల మధ్య ఇంకేం పోలికలుంటాయనేది తెలీదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News