Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. నిజానికి మార్చి 26న విడుదల కావాల్సి ఈ చిత్రం వారం ముందుగానే థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. టాక్సిక్ వాయిదా పడటంతో ఆ డేట్‌ని ఉస్తాద్ ఆక్రమించేశాడు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ని మూవీ టీం వేగవంతం చేసింది.
మార్చి 15న
ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది. కాలరే ఎత్తరా పాటతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ నిర్ణయిస్తారా అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మూవీ టీం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను డేట్ ఫిక్స్ చేశారు.
పవన్ హాజరు
హైదరాబాద్‌లో యూసఫ్ గూడ ఈ వేడుక జరగనుంది. ఇందుకోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు.తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ముఖ్య అతిథులుగా మెగా హీరోలు హాజరు అవుతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్‌లు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. అయితే ఇప్పటి పవన్ ఎక్కడ ఉస్తాద్ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన వస్తుండటంతో ఈ కార్యక్రమంపై విపరీతైమన బజ్ క్రియేట్ అయ్యింది. ఈవెంట్‌లో పవన్ స్పిచ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది.
Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్‌లో ఆ డైరెక్టర్లకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు
మార్చి 19న రిలీజ్
ఇక ఇప్పటికే ఓజీ మంచి హిట్ అందుకున్నాడు పవన్. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ భారీ హిట్ కొడుతుందని అభిమానులు, మూవీ టీం గట్టి నమ్మకంతో ఉంది. ఇక ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్‌తో మూవీ ఏ రేంజ్‌లో ఉండనుందనేది తేలనుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నాలు నటిస్తున్నారు. ఇందులో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది. తమిళ నటుడు ఆర్ పార్థిబన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యర్నేనీ, రవి యలమంచిలిలు ఈ చిత్రాన్నినిర్మించారు.

