Homeచిత్ర ప్రభVarsha Bollamma: ఓటీటీలోకి త‌మ్ముడు హీరోయిన్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Varsha Bollamma: ఓటీటీలోకి త‌మ్ముడు హీరోయిన్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Varsha Bollamma New Ott Movie: శ‌ర్వానంద్‌, స‌మంత జంట‌గా న‌టించిన జాను మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వ‌ర్ష బొల్ల‌మ్మ‌. మిడిల్ క్లాస్ మెలోడీస్‌, స్వాతిముత్యం, ఊరు పేరు భైర‌వ‌కోన సినిమాల‌తో హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. నితిన్ హీరోగా ఇటీవ‌ల రిలీజైన త‌మ్ముడులో ఓ క‌థానాయిక‌గా క‌నిపించింది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉంటున్న వ‌ర్ష బొల్ల‌మ్మ ట్రెడిష‌న‌ల్ క్యారెక్ట‌ర్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

- Advertisement -

పోలీస్ పాత్ర‌లో…
కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ వ‌ర్ష బొల్ల‌మ్మ పోలీస్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో కానిస్టేబుల్ క‌న‌కం పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. ఆగ‌స్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను వెల్ల‌డించిన ఈటీవీ విన్ ఓ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఖాకీ డ్రెస్‌లో పోలీసులుగా వ‌ర్ష బొల్ల‌మ్మ‌, రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తున్నారు. అడ‌విలో దేని గురించో అన్వేషిస్తున్న‌ట్లుగా డిజైన్ చేసిన పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. కానిస్టేబుల్ క‌న‌కం వెబ్‌సిరీస్‌కు ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాజీక్ క‌న‌కాల‌, మేఘ‌లేఖ‌, ర‌మ‌ణ భార్గ‌వ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మీట్ క్యూట్ త‌ర్వాత తెలుగులో వ‌ర్ష బొల్ల‌మ్మ చేస్తున్న సెకండ్ వెబ్‌సిరీస్ ఇది.

Also Read – War2: రెమ్యూన‌రేష‌న్‌లో హృతిక్ రోష‌న్‌ను బీట్ చేసిన ఎన్టీఆర్ – వార్ 2 కోసం ఎంత తీసుకున్నాడంటే?

కాపీ ఆరోప‌ణ‌లు…
కానిస్టేబుల్ క‌న‌కం క‌థ‌ను కాపీ కొట్టి జీ5 ఓటీటీ… విరాట‌పాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్‌సిరీస్‌ను రూపొందించిన‌ట్లు ఈటీవీ విన్ ఆరోపించింది. ఈ వివాదం కోర్టు వ‌ర‌కు వెళ్లింది. కానిస్టేబుల్ క‌థ‌ను తాను తొలుత ఓ సంస్థ‌కు చెప్పాన‌ని, వారు చేయ‌లేక‌పోవ‌డంతో ఈటీవీ విన్‌తో క‌లిసి వెబ్‌సిరీస్‌ను రూపొందించార‌ని ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల అన్నాడు. రిజెక్ట్ చేసిన ఆ సంస్థ త‌న క‌థ‌ను కాపీ కొట్టి విరాట‌పాలెం వెబ్‌సిరీస్‌ను రూపొందించింద‌నిపేర్కొన్నాడు. ఈటీవీ విన్ ఆరోప‌ణ‌ల‌పై జీ5 కూడా స్పందించింది. త‌మ‌ది ఒరిజిన‌ల్ క‌థ అంటూ పేర్కొన్న‌ది.

ఇంగ్లీష్‌లో…
ప్ర‌స్తుతం వ‌ర్ష బొల్ల‌మ్మ ఇరువ‌మ్ పేరుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీ చేస్తోంది. ఈ సినిమా త‌మిళంతో పాటు ఇంగ్లీష్ భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఓ సినిమా చేస్తున్న‌ట్లు త‌మ్ముడు ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించింది వ‌ర్ష బొల్ల‌మ్మ‌.

Also Read – Bhagyashri Borse: హాట్ ఫోజులతో కుర్రకారును ఆగం ఆగం చేస్తున్న రామ్ బ్యూటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News