Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన చెల్లి నిహారిక ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కమిటీ కుర్రాళ్లు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘బరి’. ఇటీవల పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది.
వాలీబాల్ ప్రాక్టీస్ లో
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుంది. ఇందులో వరుణ్ వాలీబాల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం బరి సినిమా కోసం వరుణ్ కఠినమైన శిక్షణ తీసుకున్నాడట. బరి కోసం ఏడు నెలలుగా వర్క్ చేస్తున్నాడట. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా వాలీబాల్ ఆడుతుండగా అతడికి గాయమైనట్టు తెలుస్తోంది. కాలికి బలమైన గాయం అవ్వడంతో మూవీ టీం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం వరుణ్ ఆస్పత్రిలోనే ఉన్నాడని టాక్.
నేడు శస్త్ర చికిత్స
ఆయన గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారట. దీంతో అపోలో ఆస్పత్రిలో నేడు (ఏప్రిల్ 15) వరుణ్ కాలికి శస్త్ర చికిత్స జరగనుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. వరుణ్ గాయం కారణంగా బరి మూవీ షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. వరుణ్ కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ గాయం కారణంగా వరుణ్ రెండు నుంచి నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Also Read: Assi OTT: ఓటీటీకి తాప్సీ ఇంటెన్సీవ్ కోర్డురూమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

