Sunday, December 8, 2024
Homeచిత్ర ప్రభVeera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ మూవీ రన్‌టైమ్ అంతా.. వర్కవుట్ అయ్యేనా?

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ మూవీ రన్‌టైమ్ అంతా.. వర్కవుట్ అయ్యేనా?

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

- Advertisement -

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ చిత్రం రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సినిమా రెండు గంటల నలభై మూడు నిమిషాలు ఉండనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రన్‌టైమ్‌ కొంచెం ఎక్కువే అని చెప్పాలి. అయితే, సినిమాలో కంటెంట్ ఆసక్తిగా ఉంటే మాత్రం ఈ విషయం పెద్ద సమస్య కాదు. లేదంటే సినిమా నిడివి సమస్యగా మారుతుంది.

గతంలో కొన్ని చిత్రాలకు సినిమా నిడివి సమస్యగా మారింది. సినిమా నిడివి ఎక్కువగా ఉండి, కంటెంట్ యావరేజ్‌గా ఉండే మాత్రం ప్రేక్షుకల్ని మెప్పించడం కష్టం. అయితే, ఈ సినిమా నిడివిపై చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పిస్తుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురు చూడాలి. మరోవైపు ఈ చిత్రానికి పోటీగా ‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’తోపాటు తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News