Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభVenkatesh: ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో వెంక‌టేష్.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో గురూజీ

Venkatesh: ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో వెంక‌టేష్.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో గురూజీ

Trivikram Srnivas: ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన విక్ట‌రీ వెంక‌టేష్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఫిక్స‌య్యింద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈ క్రేజీ కాంబో కోసం సినీ వర్గాలు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ సినిమా అతి త్వరలో పట్టాలెక్కబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన‌ భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్‌ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టైటిల్ కూడా వినిపిస్తోంది.. అదే ‘వెంకటరమణ’. వెంకీ ఇమేజ్‌కి ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని సినీ వ‌ర్గాలంటున్నాయి. టైటిల్ వింటుంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతోంది. త్రివిక్రమ్ కూడా ఈ కథని అదే విధంగా తీర్చిదిద్దబోతున్నాడని టాక్‌. గతంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav), మ‌ల్లీశ్వ‌రి సినిమాలు వ‌చ్చాయి. అయితే ఈ చిత్రాల‌కు త్రివిక్ర‌మ్ రైట‌ర్‌గా మాత్ర‌మే వ‌ర్క్ చేశారు. అయితే తొలిసారి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ సినిమా చేయ‌బోతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా పండగే అవుతుందని అంచనాలున్నాయి.

వెంక‌ట‌ర‌మ‌ణ‌ సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తేలలేదు. కానీ, రేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు స్టార్ హీరోయిన్ త్రిష (Trisha). వెంకీ, త్రిషలది హిట్ కాంబో అని తెలిసిందే. ఈ క్రేజీ కాంబోని త్రివిక్రమ్ మరోసారి రిపీట్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ బల్క్‌గా డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. త్రిష అన్ని డేట్లు ఇవ్వగలుగుతుందా లేదా అనే విషయంలో కొంత అనుమానం నెలకొంది. మరోవైపు, యంగ్ సెన్సేషన్ రుక్మిణి వసంతన్ (Rukmini Vasanthan) పేరు కూడా పరిశీలనలో ఉంది. రుక్మిణి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. వెంకీతో రుక్మిణి జోడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఖాయమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/distributors-are-competing-for-the-theatrical-rights-of-hari-hara-veera-mallu/

అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సిన త్రివిక్ర‌మ్ అదే సినిమాను ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయ‌బోతున్నారు. అయితే ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌.. దాన్ని పూర్తి చేయ‌టానికి స‌మ‌యం తీసుకుంటున్నారు. దీంతో ఈ గ్యాప్‌లో వెంక‌టేష్‌తో సినిమా చేయ‌టానికి త్రివిక్ర‌మ్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News