Thursday, January 23, 2025
Homeచిత్ర ప్రభIT Raids: ఐటీ సోదాలపై హీరో వెంకటేశ్, అనిల్‌ రావిపూడి కీలక వ్యాఖ్యలు

IT Raids: ఐటీ సోదాలపై హీరో వెంకటేశ్, అనిల్‌ రావిపూడి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ సోదాలు(IT Raids) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar), నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్, ఇతర నిర్మాతల కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.

- Advertisement -

తాజాగా ఈ ఐటీ సోదాలపై హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh), దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) స్పందించారు. దిల్ రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ.230 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ రైడ్స్‌పై మీడియా ప్రతినిధులు అడగగా.. వెంకటేష్ కూడా స్పందిస్తూ ఐటీ దాడుల విషయం తనకు తెలియదన్నారు. ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ..ప్రతి రెండేళ్లకోసారి ఐటీ దాడులు సర్వసాధారణమన్నారు. దిల్‌ రాజు పైనే కాదు చాలా మంది ఇళ్లలో దాడులు జరిగాయని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నామని మేమంటే.. సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్ళు వచ్చారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News