Venkatesh: విక్టరీ వెంకటేష్ జోరు మామూలుగా లేదు. ఇటీవలే త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను మొదలుపెట్టాడు వెంకటేష్. చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వస్తోన్న మన శివశంకరవరప్రసాద్‌గారులో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు వెంకటేష్ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
పంతొమ్మిదేళ్ల తర్వాత…
వెంకటేష్, సీనియర్ డైరెక్టర్ వీవీవినాయక్ కాంబో సెట్టయినట్లు సమాచారం. గతంలో వెంకటేష్‌తో లక్ష్మి మూవీ చేశాడు వినాయక్. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ పెద్ద హిట్టయ్యింది. పంతొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వెంకటేష్, వినాయక్ కలిసి మరో సినిమా చేయబోతున్నారట.
Also Read – Anushka: నయన్ బాటలో అనుష్క – ఘాటి ప్రమోషన్స్‌కు డుమ్మా – అసలు కారణం ఇదేనట!
రీఎంట్రీ కోసం వెయిటింగ్…
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగిన వినాయక్ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. వినాయక్ కెరీర్‌లో చివరి హిట్. ఇంటలిజెంట్‌తో పాటు బాలీవుడ్‌లో చేసిన ఛత్రపతి సినిమాలు డిజాస్టర్స్‌తో నిలవడంతో వినాయక్ కెరీర్‌కు గ్యాప్ వచ్చింది. మంచి హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలనే ఆలోచనలో ఉన్న వినాయక్… వెంకటేష్ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. వెంకీ స్టైల్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వినాయక్ శైలి మాస్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. లక్ష్మికి మంచి డబుల్ మాసీగా ఈ మూవీ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. లక్ష్మి సినిమాను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి.. వెంకటేష్, వినాయక్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.
సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు…
వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో తొలిసారి తెరకెక్కుతున్న మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలుకాబోతున్నట్లు సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్‌లో అక్టోబర్ నుంచి వెంకటేష్ జాయిన్ కాబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read – Kartik Aaryan Next Movie: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ దర్శకుడితో బాలీవుడ్ స్టార్.. రిస్క్ అవసరమా..?

