Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభVenu Swamy: క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

Venu Swamy: క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

తెలంగాణ మహిళా కమిషన్‌కు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) క్షమాపణలు చెప్పారు. గతేడాది హీరో నాగచైతన్య-శోభితా నిశ్చితార్థం అయిన వెంటనే వారిద్దరు విడిపోతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. దీంతో మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు క్షమాపణలు చెబుతూ కమిషన్ చైర్ పర్సన్‌కు లేఖ అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad