Tuesday, February 18, 2025
Homeచిత్ర ప్రభProducer Muralidharan : గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Producer Muralidharan : గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

ప్రముఖ తమిళ నిర్మాత కె మురళీధరన్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. కుంభకోణంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన తమిళ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా సేవలందించారు. తమిళంలో నిర్మించిన గోకులాతిల్ సీతై ను తెలుగులో ‘గోకులంలో సీత’గా రీమేక్ చేసి.. పవన్ కల్యాణ్ హిట్ కొట్టారు. ఈ సినిమా తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసింది. ఎందరో స్టార్ హీరోలతో మురళీధరన్ పనిచేశారు.

- Advertisement -

1994లో తొలిసారిగా అరమనై కవలన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు మురళీధరన్. లక్ష్మీ మూవీ మేకర్స్ పై.. కమలహాసన్ (అన్బే శివమ్), విజయ్ కాంత్ (ఉల్వతురై), కార్తీక్ (గోకులాతిల్ సీతై), అజిత్ (ఉన్నై తెడి), విజయ్ (ప్రియముదన్), ధనుష్ (పుదుపెట్టాయ్), శింభుతో శిలమ్ బట్టమ్ సినిమాలు నిర్మించారు. చివరిగా ఆయన నిర్మించిన సినిమా సకల కళా వల్లవన్ (జయమ్ రవి, త్రిష, అంజలి) 2015లో విడుదలైంది. కె.మురళీధరన్ మృతి పట్ల కమలహాసన్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నో హిట్ చిత్రాలు తీసిన లక్ష్మీ మూవీ మేకర్స్ కు చెందిన నిర్మాత ఇక లేరు. ప్రియమైన శివ, ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఆయనకు నా నివాళులు’’ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News