Friday, November 8, 2024
Homeచిత్ర ప్రభVettaiyan OTT Release: ఓటీటీలోకి రజనీ 'వేట్టయన్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Vettaiyan OTT Release: ఓటీటీలోకి రజనీ ‘వేట్టయన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Vettaiyan OTT Release| సూపర్ స్టార్ రజనీకాంత్(Rajnikanth) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా దసరా పండుగ కానుకగా ‘వేట్టయన్’ సినిమాతో అభిమానులను అలరించాడు. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. జడ్జి పాత్రలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కనిపించారు. వీరితో పాటు ఫహాద్ పాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే మిక్స్‌డ్ టాక్‌తో యావరేజ్ సినిమాగా నిలిచింది.

- Advertisement -

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నవంబర్‌ 8 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు సదరు సంస్థ అధికారికింగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీంతో ఈ సినిమా థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కథ: అథియన్ (రజనీకాంత్) ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తూ ఉంటారు. న్యాయం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. అలాంటి అధికారిని శరణ్య (దుశారా విజయన్) అనే ఓ స్కూల్ టీచర్ హత్య కలచివేస్తుంది. నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులపైనా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అథియాన్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. కేసు బాధ్యతల్ని తీసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే హంతకుడిని మట్టుబెడతారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేమిటి? మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్‌) ఈ ఎన్‌కౌంటర్‌ని ఎందుకు తప్పుపట్టారు? అసలు శరణ్య హత్య వెనక ఎవరున్నారు? రజనీకి, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటికీ ఉన్న సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News