Friday, March 13, 2026
Homeచిత్ర ప్రభVijay - Rashmika: విజయ్, రష్మిక పెళ్లి అని తెగ ఊదరగొట్టారే.. అసలు విషయం ఇదా!

Vijay – Rashmika: విజయ్, రష్మిక పెళ్లి అని తెగ ఊదరగొట్టారే.. అసలు విషయం ఇదా!

Vijay – Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి అంటూ నార్త్ మీడియా తెగ ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2న ఉదయ్ పూర్‌లో పెళ్లి అంటూ నానా హంగామా చేశారు. ఇక ఉదయ్ పూర్‌లోని రాజ మహల్ కూడా రెడీ అవుతోందని, విజయ్, రష్మిక పెళ్లి అంటూ రకరకాల ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేశారు. అయితే విజయ్, రష్మిక పెళ్లి అంటూ ఊదరగొట్టిన వార్తలన్నీ అవాస్తవం అని తేలిపోయింది. ఫిబ్రవరి 2న పెళ్లి కాదని, అసలు డేట్‌ను కొంత మంది లీక్ చేశారు. ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక పెళ్లి డేట్ అని సమాచారం.

- Advertisement -

విజయ్, రష్మిక ఇద్దరు కూడా సైలెంట్ రిలేషన్‌ షిప్‌ను మెయింటైన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఐదారేళ్ల నుంచి ఈ ఇద్దరూ సైలెంట్‌గా ప్రేమించుకున్నారు. డేటింగ్‌లో ఉన్న విషయాన్ని ఎక్కడా చెప్పకుండా దాచి పెడుతూ వచ్చారు. కానీ ఇద్దరూ కలిసి ఒకే వెకేషన్‌కు వెళ్లడం, ఒకే క్యాప్ పెట్టుకోవడం, కళ్లద్దాలు మార్చుకోవడం వంటివి చేస్తూ హింట్లు ఇచ్చారు. అయితే వారిద్దరూ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు.

Also Read – Niharika: అన్న చిత్రాన్ని నిర్మిస్తున్న నిహారిక?

గత ఏడాది ఈ ఇద్దరూ కూడా ప్రైవేట్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ రింగులు బయట కనిపిస్తున్నా కూడా ఆ విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఎంత మంది అడిగినా టైం వచ్చినప్పుడు చెబుతాం అని రష్మిక, విజయ్ తప్పించుకుంటూనే వచ్చారు. ఇక ఈ ఇద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడు ఓపెన్ అవుతారు? ఎప్పుడు ప్రకటిస్తారు? అని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం విజయ్, రష్మిక కలిసి మూడో సారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తరువాత రణబాలి మూవీతో ఈ ఇద్దరూ జోడి కట్టనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో విజయ్, రష్మిక డిఫరెంట్ పాత్రల్ని పోషించబోతోన్నారు. వీరి పెళ్లి తరువాత ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.

Also Read – SP Venkatesh: నేలకొరిగిన సంగీత శిఖరం.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేశ్ కన్నుమూత

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News