Kingdom Movie Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. జూలై 31న (Kingdom Release date) వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) దర్శకత్వం వహించారు. సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతుండటంతో మేకర్స్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ ఈవెంట్స్‌పై ఫోకస్ చేశారు. అందులో భాగంగా శనివారం తిరుపతిలో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే సినిమా శ్రీలంక ప్రాంతంలో జరిగే కథతో తెరకెక్కిందని అర్థమవుతోంది. అలాగే ఇద్దరన్నదమ్ముల మధ్య నడిచే కథాంశం. ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ కావాల్సినంత ఉంది. ఓ కానిస్టేబుల్‌ను అతని బాస్ స్పై ఆఫీసర్‌గా ఓ ప్రాంతానికి వెళ్లాలని చెబుతాడు. అక్కడ జైల్లోనే ఉంటూ కావాల్సిన వివరాలను సేకరించాలని చెబుతాడు. ఆ ప్రాంతంలోని వారిని కంట్రోల్ చేస్తూ ఉండే రాక్షసుల్లాంటి వ్యక్తులకు గ్యాంగ్ లీడర్ ఎవరో కాదు.. తన అన్నే అని ఓ రోజు అతనికి తెలుస్తుంది. చివరకు తనెంతో ఇష్టపడే అన్నయ్య ఎందుకలా మారాడు? గ‌్యాంగ్ లీడర్‌గా మార్చిన పరిస్థితులేంటి? చివరకు ఈ స్పై కానిస్టేబుల్ పరిస్థితేంటి? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘కింగ్డమ్’ మూవీపై ఉన్న అంచనాలను సినిమా ట్రైలర్ మరింతగా పెంచింది. విజయ్ రా అండ్ రగ్డ్ లుక్‌తో కనిపిస్తున్నారు. జెర్సీ (Jersy) తర్వాత గౌతమ్ తిన్ననూరి చేస్తోన్న సినిమా కావటంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సె (Bhagyashri Borse) కథానాయిక. లిప్ లాక్స్‌తో రెచ్చిపోయింది. విజయ్ దేవరకొండ అన్న పాత్రలో సత్యదేవ్ (Satya Dev) నటించాడు. బ్రదర్స్ మధ్య ఉండే ఎమోషన్ తెలియజేసే సాంగ్‌ను కూడా రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా హిట్ విజయ్ దేవరకొండకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే, లైగర్ (Liger) తర్వాత వచ్చిన ఖుషి పరావాలేదనిపించుకుంటే, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది. మళ్లీ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కింగ్డమ్ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంటోంది. సినిమా సరికొత్తగా ఉంటుందని, ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అంటున్నాడు. మరి ఆయన నమ్మకం నిజమవుతుందో కాదో.. తెలియాలంటే జూలై 31 వరకు ఆగాల్సిందే.


