Vijay Deverakonda – Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పెళ్లి వార్తలపై నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇన్‌డైరెక్ట్‌గా ఇద్దరూ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్‌మీట్‌లో రష్మిక మందన్నకు అందరి ముందు విజయ్ దేవరకొండ ముద్దు పెట్టేశాడు. విజయ్ చేసిన పనికి రష్మిక కూడా సిగ్గుపడటంతో పెళ్లి వార్తలను ఇలా కన్ఫామ్ చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఐదు రోజుల్లోనే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు.
ఈ సక్సెస్ మీట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరిని పలకరించారు. రష్మిక వద్దకు రాగానే ఆమె చేతిపై ముద్దుపెట్టారు. ఎలాంటి దాపరికాలు లేకుండా అభిమానులతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్ టీమ్ అందరి ముందే పబ్లిక్‌గానే రష్మికకు ముద్దు ఇచ్చాడు. విజయ్ ముద్దుతో రష్మిక మందన్న కూడా తెగ సిగ్గుపడిపోయింది. రష్మికకు విజయ్ ముద్దుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఉద్దేశించి ఫైనల్లీ ఇలా కన్ఫామ్ చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. విజయ్ రియల్ లైఫ్ గర్ల్‌ఫ్రెండ్ రష్మిక అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు.
ఈ సక్సెస్ మీట్‌లో విజయ్, రష్మిక ఒకరిపై మరొకరు పోటీపడి మరి పొగడ్తలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. రష్మికను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ…’గీత గోవిందం నుంచి రష్మికను చూస్తున్నా. నిజంగా భూమాదేవినే. అక్కడి నుంచి మొదలైన తన జర్నీ ఇప్పుడు బలమైన స్క్రిప్ట్‌లను ఎంచుకునే స్టేజ్‌కు చేరుకుంది. రషి…నీ జర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది నన్ను ఎవరైనా గెలికితే రివర్స్‌లో వెళతా. కానీ రష్మిక మాత్రం ఏవి పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. ఏదో ఒక రోజు ప్రపంచం నీ టాలెంట్‌ను గుర్తిస్తుంది అని చెప్పాను. అది నిజమైంది” అని విజయ్ దేవరకొండ అన్నాడు. విజయ్ మాటలతో రష్మిక ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ కనిపించింది. ” ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం ఓ వరం” అంటూ రష్మిక కూడా తన స్పీచ్‌లో విజయ్‌పై ప్రశంసలు కురిపించింది. విజయ్, రష్మిక స్పీచ్‌లు వైరల్ అవుతున్నాయి. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరిలో జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


