Vijay Deverakonda Next Movie: కొన్నిసార్లు ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయని కాంబినేషన్స్ సడెన్‌గా ఫిక్సవుతుంటాయి. అలాంటి ఓ కాంబినేషన్ టాలీవుడ్‌లో కుదిరింది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల విజయ్‌తో కింగ్డమ్ (Kingdom)సినిమాను నిర్మించిన సూర్యదేవర నాగవంశీ ఈ కొత్త మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే విజయ్ దేవరకొండ, హరీశ్ శంకర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతున్నారు.
కింగ్డమ్ మిక్స్‌డ్ టాక్…
విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ కింగ్డమ్ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు 80 శాతం మేర మాత్రమే రికవరీ సాధించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ యాక్టింగ్‌తో పాటు టెక్నికల్‌గా సినిమా బాగుందనే కామెంట్స్ వినిపించాయి. సెకండాఫ్ స్లోగా సాగడం, ఛత్రపతి, రెట్రో వంటి సినిమాలతో పోలికలు రావడం కింగ్డమ్‌కు మైనస్‌గా మారింది.
పీరియాడికల్ మూవీ…
కింగ్డమ్ మూవీపై రౌడీ స్టార్ చాలా ఆశలనే పెట్టుకున్నాడు. సినిమా రిలీజైన తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. పెట్టిన బడ్జెట్ కు వచ్చిన వసూళ్లను సంబంధం లేదు. దీంతో కింగ్డమ్ తర్వాత రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాహుల్ సాంకృత్యాన్ మూవీతో పాటు రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన సినిమాను అంగీకరించాడు విజయ్. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మాస్ యాక్షన్ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్…
మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో డైరెక్టర్‌గా బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఈ నెలాఖరుతో ఉస్తాద్ షూటింగ్ కంప్లీట్ కాబోతుంది. పవర్ స్టార్, హరీష్ కాంబోలో వస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేస్తున్న మూవీ ఇది. ఈ సినిమాను 2022లో అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, డిప్యూటీ సీఏంగా మారడంతో షూటింగ్ ఆలస్యమైంది.


