Homeచిత్ర ప్రభVijay Devarakonda: 'హాయ్‌ నాన్న' డైరెక్టర్‌తో విజయ్‌ కొత్త సినిమా గ్రాండ్‌ లాంచ్‌.. క్లాప్‌ కొట్టిన...

Vijay Devarakonda: ‘హాయ్‌ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్‌ కొత్త సినిమా గ్రాండ్‌ లాంచ్‌.. క్లాప్‌ కొట్టిన హీరో

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ బ్యాక్ టూ బ్యాక్‌ చిత్రాలతో దూసుకపోతున్నాడు. లైగర్‌ డిజాస్టర్‌, ఖుషి ప్లాప్‌తో కాస్తా గ్యాప్‌ తీసుకున్న విజయ్‌ ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్‌, కింగ్‌డమ్‌తో యావరేజ్ హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత దిల్‌ రాజు బ్యానర్‌లో రెండు సినిమాలు ప్రకటించాడు. ప్రస్తుతం రౌడీ జనార్థన్‌, రణబలి చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్‌ అంతలోనే మరో ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమంతో గ్రాండ్‌ లాంచ్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి న్యాచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

- Advertisement -

ముఖ్య అతిథిగా నాని
ఈ మూవీ పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ చిత్రానికి హాయ్‌ నాన్న ఫేం శార్యువ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. సోమావారం (ఏప్రిల్‌ 20) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ఈ సందర్భంగా హీరో నాని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోలను ఒకే ఫ్రేమ్‌ చూసి ఫ్యాన్స్‌ అంత మురిసిపోతున్నారు.

హాలీవుడ్ రేంజ్ లో…
ఇందులో వారిద్దరి సన్నిహితం, బాండింగ్‌ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. కాగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ సినిమాకు హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్‌ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ‘గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్’ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు.

‘యానిమల్, ఓం శాంతి ఓం’ వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించనున్నాడు. పలు సూపర్ హిట్ చిత్రాలకు కంపోజర్‌ చేసిన హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ మూవీ కాంబో సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌, ఇంటర్నేషనల్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని గ్లోబల్‌ రేంజ్‌లో చేస్తుండటంతో రాజమౌళి ‘వారణాసి, అట్లీ ‘రాకా’ చిత్రాలు ఎలా అయితే పోటీ పడుతున్నాయో.. ఆ జాబితాలో ఈ మూవీ కూడా ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని నిర్మాణ సంస్థ తమ పోస్టులో తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News