Thursday, March 5, 2026
HomeTop StoriesVIROSH: సొంత ఊరిలో 'విరోష్' గృహప్రవేశం.. గ్రామస్థులందరికీ అదిరిపోయే విందు.!

VIROSH: సొంత ఊరిలో ‘విరోష్’ గృహప్రవేశం.. గ్రామస్థులందరికీ అదిరిపోయే విందు.!

VIROSH House Warming: వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన టాలీవుడ్‌ క్రేజీ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక.. ఈ రోజు నూతన ఇంట్లోకి అడుగుపెట్టారు. తెలుగు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా గృహప్రవేశం చేసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లయ్యాక తొలిసారిగా అత్తగారింటికి చేరుకున్న రష్మికను చూడటానికి అభిమానులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/three-died-in-jallikattu-occasion-tamilnadu/

ఈ నెల 4న హైదరాబాద్‌లో నూతన దంపతులు విజయ్‌, రష్మికల రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా విజయ్ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్ పేటకు ‘విరోష్‌’ జోడి చేరుకుంది. ఈ ఉదయం గ్రామానికి చేరుకున్న ఈ నూతన వధూవరులను చూసేందుకు గ్రామస్థులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామస్థులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా విజయ్‌ తన ఫామ్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి రష్మికతో కలిసి గృహప్రవేశం చేశారు. అనంతరం వేద పండితుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపట్టారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య జరిగిన ఈ వేడుకలో విజయ్ దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: https://teluguprabha.net/top-stories/four-women-missing-from-the-same-family-in-sathya-sai-district/

విజయ్ తన సొంత ఊరికి రావడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గృహప్రవేశం అనంతరం గ్రామస్థులందరికీ దంపతులు భారీగా దావత్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ వద్ద విజయ్, రష్మికలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు, గ్రామస్థులు తరలివచ్చారు.

పెళ్లి చేసుకుని తొలిసారిగా సొంతూరికి అడుగుపెట్టిన సందర్భంగా విజయ్‌ దేవరకొండ శుభవార్త చెప్పారు. అచ్చంపేట డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్‌ ద్వారా స్కాలర్‌షిప్‌ అందజేయాలని నిర్ణయించినట్లు విజయ్‌ తెలిపారు. 9, 10 తరగతుల్లో ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుందని.. మొత్తంగా 44 పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News