Vijay-Rashmika: రష్మిక-విజయ్ దేవరకొండ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు గత ఫిబ్రవరిలో 26న మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం హనీమూన్ వెళ్తారనుకుంటే బడ్డీ మూన్ అంటూ స్నేహితుల కలిసి వెకేషన్ ప్లాన్ చేశారు. ఇటీవల వారు థాయ్‌లాండ్ వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తున్నారు.
విరోష్ బడ్డీమూన్
ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మికలు వారు ఉంటున్న విల్లాకి సంబంధించిన వీడియో షేర్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి అంతా ఈ విల్లాపై పడింది. ఎంతో లగ్జరీగా, విలాసవంతంగా ఉన్న ఈ విల్లా రెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకరోజుకి ఈ విల్లా ఖర్చు తెలిసి అంతా అవాక్కావుతున్నారు. ఇంతకి ఆ విల్లా ప్రత్యేకత ఏంటో చూద్దాం. థాయ్‌లాండ్‌లోని ప్రసిద్ధ ద్వీపం కో సమూయ్‌లో ప్రాంతంలోని ‘కో కూన్’ అనే విలాసవంతమైన విల్లాలో దిగారు.
విల్లా ప్రత్యేకతలు
చావెంగ్ నోయి కొండలపై ఉన్న ఈ విల్లా ఆధునిక డిజైన్, ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. మొత్తం 7+2 బెడ్‌రూమ్‌లతో, మినిమలిస్టిక్ ఇంటీరియర్ డిజైన్‌తో ఈ విల్లా ఎంతో ప్రశాంత వాతావరణాన్ని అందిస్తోంది. సముద్రం కనిపించే ఓపెన్ సిట్టింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ ఈ విల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ విల్లా ఖర్చు విషయానికి వస్తే లగ్జరీ స్థాయికి తగ్గట్టుగానే ధర కూడా భారీగానే ఉంది. మూడు రాత్రులకు సుమారు రూ.7.8 లక్షలు ఖర్చవుతుండగా, ఒక్క రాత్రికి దాదాపు రూ.2.6 లక్షలు చెల్లిస్తున్నారట. ఈ ప్యాకేజీలో బ్రేక్‌ఫాస్ట్, విల్లా సర్వీసులు, హౌస్‌కీపింగ్, ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌ఫర్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు.
ఇటీవల రష్మిక ఈ వెకేషన్ కి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండను తన భర్త అని పిలవడం ఇంకా తనకు అలవాటు కాలేదంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. విజయ్‌ని నా భర్త అని చెప్పుకోవడం చాలా కొత్తగా ఉందని మురిసిపోయారు. అలాగే ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయటం, డాన్స్ చేసిన మూమెంట్స్ అన్నింటిని కలిపి ఒక వీడియోగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా రష్మిక , విజయ్ దేవరకొండ బడ్డీ మూన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

