Vijay Divorce: తమిళ స్టార్ హీరో థళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో చెన్నైలో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అవుతున్న వేళ విజయ్‌కి సంగీత షాకిచ్చింది. విజయ్ ఓ నటితో అక్రమ సంబంధంలో ఉన్నాడని, అతడి నుంచి తనకు విడాకులు కావాలని కోరుతూ ఇటీవల చంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆయన భార్య సంగీత విడాకులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పోలిటికల్ కెరీర్ పై ఎఫెక్ట్
అప్పటి నుంచి విజయ్ విడాకుల వ్యవహరంపై సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. మీడియా, సోషల్ మీడియాలో విజయ్ హాట్ టాపిక్‌గా మారాడు. ఈ క్రమంలో వీరి విడాకులకు సంబంధించి పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు వీరి విడాకులకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా విజయ్ నటనకు ఫుల్‌స్టాప్ పెట్టి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన భార్య వేసిన విడాకులు పిటిషన్ విజయ్ పోలికల్ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రూ. 250 కోట్ల భరణం
ఈ క్రమంలో విజయ్ ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నాడట. పబ్లిక్ గా కాకుండ ప్రైవేట్ గా విడాకుల వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నట్టు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం విజయ్ తన భార్య సంగీత భరణం భారీగా ఆఫర్ చేసినట్టు కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కోర్టులో విజయ్-సంగీతల విడాకులు పిటిషన్‌పై విచారణ జరగనుంది. అయితే తాను కోర్టు మెట్ల ఎక్కకుండ ఉండేందుకు భార్యతో విజయ్ ఓ డీల్ చేసుకునేందుకు ముందుకు వచ్చాడట. సంగీతకు భరణంగా రూ. 250 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యాడట. తన భార్య తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం విజయ్ సంగీతకు ఇంత పెద్ద మొత్తంలో భరణం ఆఫర్ చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సంగీత మాత్రం అందుకు సానుకూలంగా లేదని తెలుస్తోంది.
అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. విడాకులు వార్తలు హల్‌చల్ చేస్తున్న విజయ్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దిశగా తన టీంతో విజయ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయకుడు విడుదల కావాల్సి ఉంది. ఆయన రాజకీయ ఎంట్రీకి ఈ సినిమా మరింత ప్లస్ అయ్యేలా దర్శకుడు హెచ్ వినోద్ ఈ మూవీ తెరకెక్కించాడు. ఆయన పోలిటికల్ ఎంట్రీకి మరింత ప్రయోజనం చేకూర్చేలా మూవీలో కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే విజయ్ రాజకీయ పార్టీ భావజాలం, ఆదర్శాలను ప్రోత్సహించేలా సీన్స్, అలాగే ప్రతిపక్ష పార్టీలను విమర్శించే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి, అందుకే ‘జన నాయగన్’ కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి CBFC బోర్డు అభ్యంతరం చెప్పినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
Also Read: Allu Arjun: నటి పావలా శ్యామలాకు అల్లు అర్జున్ భరోసా.. ప్రతి నెల ఆర్థిక సాయం

