Gandhi Talks Movie Review: ఊహించండి – ఒక సినిమా వస్తుంది, అందులో ఒక్క మాట కూడా ఉండదు! ఎప్పుడో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘పుష్పక విమానం’ అనే మూకీ సినిమా తీశారు. కమల్ హాసన్ అద్భుత నటనా వైదుష్యాన్ని చూశాం, అందులో. ఇప్పుడు ఈ కాలంలో ఒక మూకీ సినిమాని ఎలా ఊహించగలం! కానీ ‘గాంధీ టాక్స్’ అనే మూకీ మూవీ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి హీరోలు. ముంబయి ఛావ్ల్‌ల నుంచి హై-రైజ్ బిల్డర్ల వరకు, డబ్బు ఎలా మనల్ని మారుస్తుందో చూపిస్తుంది. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్, నో డైలాగ్స్ – ఇది రిస్కీ ప్రయోగం.
మహాదేవ్ (విజయ్ సేతుపతి) ఒక సామాన్య యువకుడు – డిగ్రీ ఉంది, జాబ్ లేదు. అమ్మ ఆరోగ్యం బాగాలేదు. గాళ్‌ఫ్రెండ్ గాయత్రి (అదితి రావ్ హైదరి) పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేస్తోంది. ముంబైలో డబ్బు లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఇక బోస్‌మన్ (అరవింద్ స్వామి) ఒకప్పుడు బడా బిల్డర్. ఇప్పుడు దివాలా, ఫ్యామిలీ లాస్, ఒంటరితనం. రెండు వేర్వేరు ప్రపంచాలు – ఒకటి పేదరికం, మరొకటి మనీ లాస్ – ఒకే ప్లాన్‌తో కలుస్తాయి. మహాదేవ్ ఒక రిస్కీ ఆలోచన చేస్తాడు. డబ్బు (గాంధీజీ నోట్లు) మాట్లాడే ఈ లోకంలో ఇంటిగ్రిటీ ఎలా బతుకుతుందో చూపించే కథ. సింపుల్‌గా చెప్పాలంటే – డబ్బు కోసం మనం ఎంత దూరం వెళ్తామో చూపించే కథ.
డైలాగ్స్ లేకపోవడమే ‘గాంధీ టాక్స్’ స్ట్రెంగ్త్. డైరెక్టర్ కిశోర్ బెలేకర్ ముంబై ఛావ్ల్ (సామూహిక నివాస భవనాలు) లైఫ్‌ని, స్కైస్క్రేపర్లని సూపర్‌గా కనెక్ట్ చేశాడు. మహాదేవ్ ఉద్యోగ వేట, లంచం ఇవ్వలేకపోవడం, అమ్మ హాస్పిటల్ బిల్స్ – ఇవన్నీ మనలాంటి మిడ్లిల్ క్లాస్ అబ్బాయిలు ఫేస్ చేసేవే. బోస్‌మన్ పాత్రతో రిచ్ గై ఒంటరితనం చూపిస్తాడు దర్శకుడు – డబ్బు ఉన్నా సంతోషం లేదు. రెండు భిన్న ధ్రువాలు కలిసిన తర్వాత కామెడీ, ఎమోషన్ మిక్స్ అదిరిపోతుంది. ఒక సీన్‌లో మహాదేవ్ దొంగతనానికి ముందు చెప్పులు తీసి పక్కన పెట్టడం – అది మన ఇంటిగ్రిటీని చూపించే సూపర్బ్ షాట్! మధ్యలో కథనం కొంచెం స్లో అయినా, క్లైమాక్స్ ఎమోషనల్‌గా హిట్. రెహమాన్ మ్యూజిక్ మాట్లాడుతుంది – సౌండ్స్, మెలోడీస్ ద్వారా ఫీలింగ్స్ డైరెక్ట్‌గా హృదయాన్ని టచ్ చేస్తాయి. ఇది జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ కాదు – డబ్బు వర్సెస్ మనుషులు అనే రియల్ క్వశ్చన్ వేసే సినిమా. మన జనరేషన్‌కి ఇది మిర్రర్ లాంటిది. కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువైనా, ఓవరాల్ ఇది బ్రేవ్ అటెంప్ట్.
విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ని తన భుజాల మీద మోసేశాడు. మాటలు లేకుండా కళ్లతోనే నిరాశ, ప్రేమ, గిల్ట్ చూపించాడు – అది అత్యంత నేచురల్‌గా. అతని ఫేస్ చూస్తే మనలాంటి బాయ్‌ని చూసినట్లు అనిపిస్తుంది. డాన్స్ సీక్వెన్స్ కూడా కిల్ చేశాడు. బోస్‌మన్‌గా అరవింద్ స్వామి కూల్‌గా, కంట్రోల్డ్‌గా నటించాడు – సంపన్నుడి ఒంటరితనాన్నీ, మనీ లాస్‌ను ఉన్నత స్థాయిలో ప్రెజెంట్ చేశాడు. గాయత్రిగా అదితి రావ్ స్వీట్‌గా, అదే సమయంలో స్ట్రాంగ్‌గా ఉంది – ఆమె లవ్, ప్రెజర్ రియల్‌గా ఫీల్ అయినట్లే అనిపిస్తుంది. దొంగగా సిద్ధార్థ్ జాదవ్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడు – మాట్లాడకుండానే నవ్విస్తాడు, ముఖ్యంగా ద్వితీయార్ధంలో అతని సీన్స్ హైలైట్. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగుంది – మహేశ్ మంజ్రేకర్, ఉషా నాద్‌కర్ణి లాంటి వాళ్లు పాత్రలకు లైఫ్ ఇచ్చారు. మొత్తంగా నటీనటులు నో-డైలాగ్ చాలెంజ్‌ని సూపర్‌గా హ్యాండిల్ చేశారు – వీళ్ల హావభావాలతో సినిమా జీవంతో తొణికిసలాడింది.
సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ – ఇరుకు ఛావ్ల్ వర్సెస్ ఆకాశ హర్మ్యాల కాంట్రాస్ట్.. సూపర్. ఎడిటింగ్ స్మూత్‌గా సాగి, సైలెన్స్‌ని బోరింగ్ కాకుండా చూసింది. రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ – మ్యూజిక్ లేకుండా ఈ సినిమాని ఊహించలేం. సౌండ్ డిజైన్, యాంబియంట్ నాయిస్‌లు ఎమోషన్స్‌ని బూస్ట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ – ముంబైని రియల్‌గా ఫీల్ అవుతాం. పాత్రల స్టేటస్‌ను ఆర్ట్, కాస్ట్యూమ్స్ బాగా చూపించాయి. టెక్నికల్‌గా ఇది స్ట్రాంగ్ ప్యాకేజీ.
‘గాంధీ టాక్స్’ అనేది బ్రేవ్, థాట్ ప్రొవోకింగ్ మూవీ. విజయ్ సేతుపతి అభినయం, రెహమాన్ మ్యూజిక్ సినిమాకి ప్రాణవాయువులు. మాస్ ఎంటర్‌టైనర్ కాదు. కానీ యూత్‌కి, థింకర్స్‌కి మస్ట్ వాచ్ మూవీ.
రేటింగ్: 3.5/5
– యజ్ఞమూర్తి

