Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభVijay Sethupathi : కొత్త లుక్ లుక్ లో విజయ్ సేతుపతి..ఆశ్చర్య పోతున్న ఫ్యాన్స్

Vijay Sethupathi : కొత్త లుక్ లుక్ లో విజయ్ సేతుపతి..ఆశ్చర్య పోతున్న ఫ్యాన్స్

తమిళ ఇండస్ట్రీలో హీరో, విలన్ గా వరుస సినిమాలు చేస్తూ.. వర్సెటైల్ నటుడిగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ను సంపాదించుకున్న వ్యక్తి విజయ్ సేతుపతి. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సేతుపతి. తెలుగులోకి ఆయన చేసిన చాలా సినిమాలు డబ్ అయ్యాయి కానీ.. ఆయన తండ్రి పాత్రలో నటించిన ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా ఉప్పెన తో గుర్తింపు లభించింది. ఉప్పెన కు ముందొచ్చిన మాస్టర్, ఇటీవలే వచ్చిన విక్రమ్ సినిమాల్లో విలన్ పాత్రలో కనిపించినా.. ఆ రెండూ తెలుగులోకి డబ్ అయిన సినిమాలే.

- Advertisement -

ఉప్పెనతో వచ్చిన గుర్తింపుతో.. విజయ్ సేతుపతికి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది. కాగా.. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి కాస్త లావుగా కనిపించారు. ఆయన కొంచెం లావు తగ్గితే బాగుంటుందని అనుకున్నారు ఫ్యాన్స్. తాజాగా తన స్లిమ్ లుక్ తో అందరినీ స్టన్ అయ్యేలా చేశాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన కొత్త లుక్ ఫొటోలు విపరీతంగా వైరలవుతున్నాయి. మరి విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కోసం బరువు తగ్గారో లేక ఏదైనా సినిమా కోసం ఈ ట్రాన్స్ఫర్ మేషన్ వచ్చిందో తెలీదు గానీ.. కొత్తలుక్ లో మతి పోగొడుతున్నారు. అమ్మాయిలు సైతం విజయ్ సేతుపతి ఇంత హ్యాండ్సమ్ గా ఉంటాడా అని నోరెళ్లబెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News