Sunday, February 8, 2026
HomeTop StoriesJailer 2: జైలర్ 2 లో విజయ్ సేతుపతి.. ఎందుకు ఒప్పుకున్నాడంటే!

Jailer 2: జైలర్ 2 లో విజయ్ సేతుపతి.. ఎందుకు ఒప్పుకున్నాడంటే!

Jailer 2: జైలర్ 2 లో విజయ్ సేతుపతి.. ఎందుకు ఒప్పుకున్నాడంటే!.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తమిళంలో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ విలక్షణ నటుడిగా పాపులారిటీని తెచ్చుకున్న సేతుపతి, త్రిష కంబ్యాక్ మూవీ 96 లాంటి డిఫరెంట్ లవ్‌స్టోరీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో అంటే ఇలాగే ఉండాలనే లెక్కలను, అంచనాలను మార్చిన నటుడు విజయ్ సేతుపతి.

- Advertisement -

సమంత, నయనతార లాంటి వారు కూడా విజయ్ సేతుపతి సరసన నటించడానికి ఒప్పుకున్నారంటే ఆ మాస్ హీరో టాలెంట్, పర్ఫార్మెన్స్ ఏంటో.. కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కతువాకుల రెండు కాదల్ వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అలా, క్రేజీ సినిమాలలో నటిస్తూ సౌత్‌లో తనకంటూ ఓ సపరేట్ మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు.

Also Read – Perni Nani: పాదయాత్రతో జగన్‌ మళ్లీ ప్రజల వద్దకు.. వైసీపీ రోడ్‌మ్యాప్ సిద్దం..!

ప్రస్తుతం తెలుగులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేశాడు విజయ్ సేతుపతి. బెగ్గర్, స్లమ్ డాగ్ లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అయితే, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ జైలర్. 2023లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. వారి పాత్రలు సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.

అలాంటి ఓ సూపర్ కామియోను విజయ్ సేతుపతి కూడా పోషించాడు. అది జైలర్ 2లో. తాజాగా, ఈ విషయాన్ని స్వయంగా మక్కల్ సెల్వన్ వెల్లడించాడు. కేవలం రజినీకాంత్ కోసమే తాను జైలర్ 2లో నటించానని తెలిపాడు. కాగా, మోటి భాగానికి కంటే ఇంకా హై రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతోంది. మొదటి భాగంలో నటించిన మోహన్ లాల్, శివన్నతో పాటు టాలీవుడ్ సీన్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, సునీల్, విద్యా బాలన్, రమ్యకృష్ణ, మిథూన్ చక్రవర్తి లాంటి సీనియర్ స్టార్స్ కనిపించబోతున్నారు.

Also Read – IND vs NZ 3rd ODI: సిరీస్ విజేతను తేల్చే ఆఖరి పోరు ఎప్పుడంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News