Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభRashmika: విజ్జూ నిన్ను గర్వపడేలా చేస్తా.. విజయ్ దేవరకొండ పోస్టుకు రష్మిక రిప్లై

Rashmika: విజ్జూ నిన్ను గర్వపడేలా చేస్తా.. విజయ్ దేవరకొండ పోస్టుకు రష్మిక రిప్లై

Rashmika And Vijay Devarakonda Posts: నేషనల్ క్రష్ రష్మిక వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘యానిమల్’, ‘పుష్ప2’ చిత్రాలతో నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ఇటీవల విడుదలైన ‘కుబేర’ చిత్రంలోనూ తన నటనతో ఆకట్టుకుంది. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడి ఓరియంటెడ్ మూవీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ అమ్మడు. తాజాగా ‘మైసా’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ షాక్ కు గురిచేసింది. కత్తి పట్టుకుని మొహం నిండా రక్తంతో గంభీరంగా రష్మిక లుక్ ఉంది.

దీంతో అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా రష్మిక లుక్ అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ `ఇది అద్భుతంగా ఉండనుంది’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. విజయ్ పోస్టుకు రష్మిక ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ పోస్టును షేర్ చేస్తూ ‘విజ్జూ.. ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను” అని చెబుతూ హార్డ్ ఎమోజీని పెట్టింది.

విజ్జూ అని ప్రేమగా పిలవడంతో రష్మిక పోస్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ ప్రేమలోఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైలో కూడా ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరి మధ్య రిలేషన్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక మూవీ పోస్టర్ ను విజయ్ దేవరకొండ షేర్ చూస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పడం.. దానికి గర్వపడేలా చేస్తా విజ్జూ అంటూ రష్మిక రిప్లై ఇవ్వడం చూస్తుంటే ఈ ఇద్దరు ప్రేమలో ఉండటం నిజమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే వీరిద్దరు కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన విషయం విధితమే. ఈ సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు క్లోజ్ గా ఉండటం.. కలిసి ప్రయాణాలు చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇంతవరకు వీరు ఈ రూమర్స్ పై స్పందించలేదు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్ డమ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది జులైలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News