Vinayakan injured: ‘జైలర్’ సినిమాలో వర్మగా తన విలక్షణ నటనతో మెప్పించిన వినాయకన్, ప్రస్తుతం ఓ షూటింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ‘ఆడు 3’ సినిమా కోసం కేరళలోని తొడుపుజలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో మెడలోని నరాలు దెబ్బతినడంతో పాటు శరీరానికి ఇతర చోట్ల కూడా గాయాలయ్యాయి.
ALSO READ: Eesha Review: ‘ఈషా’ మూవీ రివ్యూ.. నిజంగా భయపెడుతుందా?
ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆయన్ని కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. సరైన సమయంలో వైద్య సహాయం అందడంతో పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది, కానీ గాయాల తీవ్రత దృష్ట్యా ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వినాయకన్ కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటివరకు ఆయన ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదని స్పష్టం చేశారు. దీంతో ఆయన కోలుకునే వరకు ‘ఆడు 3’ షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.
ALSO READ: The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అదిరింది!
సాధారణంగా వివాదాలతో వార్తల్లో ఉండే వినాయకన్, ఇలా గాయపడటం బాధాకరమని సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. తదుపరి వైద్య పరీక్షల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

