Manchu Manoj – Kannappa: విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని తొలి రోజున రూ.20 కోట్ల (Kannappa Collections) గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇటీవలి కాలంలో సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో అంచనాలు, అంతకు మించి వివాదాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, విష్ణు కెరీర్‌లో ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అవుట్‌పుట్ అస్సలు ఊహించని విధంగా ఉంది. విష్ణు పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపిస్తోంది.
కన్నప్ప సినిమా విజయం ఒక వైపు ఉంటే, విష్ణు పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లు మరో వైపు. ముఖ్యంగా, రీసెంట్‌గా ఆయనకు మనోజ్‌తో వచ్చిన గొడవలు గురించి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో, సొంత తమ్ముడు మనోజ్ వచ్చి, సినిమాను మొదటి రోజునే చూసి, మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడం అనేది డిస్కషన్ పాయింట్. కన్నప్ప విజయం సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్‌లో విష్ణు అండ్ టీమ్ పాల్గొంటే మీడియా ప్రతినిధులు మనోజ్ సినిమాను చూసి అప్రిషియేట్ చేయటంపై ప్రశ్నించారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-hari-hara-veera-mallu-release-date-confirmed/
మనోజ్ అప్రిషియేషన్స్‌పై రియాక్ట్ అయిన విష్ణు.. సినిమా చూసి అభినందించిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు. రిలీజ్‌కు మందు రోజు కూడా కన్నప్ప టీమ్‌కు అభినందనలు తెలియజేస్తూ మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఎక్కడా తన అన్న విష్ణు పేరుని మనోజ్ ప్రస్తావించలేదు. అలాగే రిలీజ్ రోజున వచ్చి తొలి ఆటను చూసి సినిమా నేను ఊహించిన దాని కంటే వెయ్యి రెట్లు బావుందని, ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్ నెక్ట్స్ రేంజ్‌లో ఉందని అన్నారు. విష్ణు పేరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా అన్న ఇంత బాగా చేస్తాడని అనుకోలేదంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కన్నప్ప సినిమాను మనోజ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా మంచు మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో శివుడుగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, రుద్ర అనే పాత్రలో ప్రభాస్, కిరాతకుడి పాత్రలో మోహన్ లాల్ సహా శరత్ కుమార్, మోహన్ బాబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.