Vishnu Manchu: విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రంలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ నటించగా పరమేశ్వరుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించింది. కిరాతకుడి పాత్రలో మోహన్ లాల్, మహదేవ శాస్త్రి పాత్రలో ఎం.మోహన్ బాబు నటించారు. కన్నప్ప పై ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్‌పై విష్ణు మంచు రిలీజ్‌కు ముందే క్లారిటీ ఇచ్చేశారు. విష్ణు మంచు చెప్పిన దాని ప్రకారం, ‘కన్నప్ప’ థియేటర్లలో విడుదలైన 10 వారాల వరకు ఓటీటీలోకి రాదు. ఈ మేరకు తాను ఇప్పటికే ఒక డీల్ కుదుర్చుకున్నానని, దీనివల్ల తనకు ఓటీటీ రిలీజ్ ప్రెషర్ లేదని ఆయన వెల్లడించారు. ‘ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించడమే నా ప్రధాన లక్ష్యం’ అని విష్ణు స్పష్టం చేశారు. గతంలో ఓటీటీ డీల్ కోసం చర్చలు జరిపినప్పుడు, వారు చెప్పిన ఫిగర్ నచ్చలేదని, అయితే సినిమా విజయం సాధించాక అమ్మితే చెప్పిన నంబర్ తనకు నచ్చిందని ఆయన తెలిపారు. తాను పెట్టిన బడ్జెట్ థియేట్రికల్ రన్‌లోనే తిరిగి వస్తుందనే నమ్మకం తనకు ఉందని విష్ణు గట్టిగా చెప్పారు.
కన్నప్ప మూవీ రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్‌కు కూడా చూపిస్తానని తెలిపిన విష్ణు.. పవన్ ఇప్పుడు ఒకప్పటిలా మనకు తెలిసిన వ్యక్తి కాదు. చాలా బాధ్యతలున్నాయని, ఆయన వీలుని బట్టి ఆయన్ని సినిమాను చూడమంటానని, పవన్ తనకు సీనియర్ నటుడని, ఆయన ప్రశంసలు కూడా తనకెంతో అవసరం అని విష్ణు పేర్కొన్నారు.