Vishnu Manchuవిష్ణు మంచు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్‌గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ హైలైట్ అయ్యింది. ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas) ‘రుద్ర’గా, అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‘పరమేశ్వరుడు’గా, కాజల్ అగర్వాల్ ‘పార్వతీదేవి’గా, మోహన్‌లాల్ (Mohan Lal) ‘కిరాతకుడు’గా, మోహన్ బాబు (Mohan Babu) ‘మహదేవ శాస్త్రి’గా కనిపించారు. ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ హెవీగా కొనసాగుతోంది.
విష్ణుకి ఇలాంటి సక్సెస్ వచ్చి చాలా కాలమే అవుతుంది. సినిమాను చూసిన వారందరూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. రోజు రోజుకి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ పెరుగుతుండటంతో వసూళ్లు పెరుగుతున్నాయని సినీ సర్కిల్స్ అంటున్నాయి. తొలి రోజున అంటే జూన్ 27న కన్నప్ప సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అంటే రూ.10 కోట్లు షేర్ కలెక్షన్స్ (kannappa Collections) వచ్చాయి. ఇక రెండో రోజు అదే పాజిటివ్ టాక్‌తో వసూళ్లను రాబట్టింది. అయితే తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రావటం హాట్ టాపిక్‌గా మారింది. రెండో రోజున కన్నప్ప మూవీ రూ. 22.5 కోట్లు వచ్చాయి. అంటే రెండు రోజుల్లో రూ.42.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడో రోజున ఆదివారం ఈ కలెక్షన్స మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.
కన్నప్ప సినిమాపై విజయం కనిపించడంతో ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే, విష్ణు మంచు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఆయన ఇప్పటికే ఓ డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతూ ‘కన్నప్ప’ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత 10 వారాలు ఓటీటీలో రాదని ప్రకటించారు. “నాకు ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. నా లక్ష్యం ప్రేక్షకులకు మంచి సినిమా అందించడం మాత్రమే. ఓటీటీ డీల్ కోసం చర్చించినప్పుడు వారు చెప్పిన రేటు నాకిష్టంగా లేదు. కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత చెప్పిన ఫిగర్ బాగుంది. అందుకే ఓటీటీ విషయంలో నిశ్చింతగా ఉన్నాను. సినిమా బడ్జెట్ థియేటర్ రన్‌లోనే తిరిగి వస్తుందనే నమ్మకం ఉంది,” అని విష్ణు చెప్పారు.