Vishnu Manchu – Prabhas: విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ మూవీ ‘కన్నప్ప’. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాపై ప్రారంభంలో ట్రోల్స్ వచ్చినప్పటికీ రాను రాను బజ్ క్రియేట్ చేయటంలో యూనిట్ సక్సెస్ అయ్యింది. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమాను చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించి విష్ణు ఉన్నదంతా పెట్టి ఈ సినిమా చేశానని, ప్రేక్షకులు, శివుడు ఆశీస్సులతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. పక్కా ప్లానింగ్‌తో వెళ్లటం వల్ల కన్నప్ప సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.
కన్నప్ప సినిమాను చూసిన అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీంతో కన్నప్ప ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ వారం నాదే సక్సెస్ అంటూ నమ్మకంగా ఉన్న విష్ణు నమ్మకం ఎంత వరకు నిజమైంది. అసలు నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారనే వివరాలను చూస్తే..
కన్నప్ప ఫస్టాఫ్ నార్మల్‌గానే ఉందని, ఇంట్వరెల్ నుంచి మూవీ పికప్ అయ్యిందని, ఇక సెకండాప్ అత్యద్భుతంగా ఉందని నెటిజన్స్ అంటున్నారు. భక్తిలోని అమాయకత్వాన్ని, సనాతన ధర్మ విలువలను చక్కగా చూపించారు. అతిథి పాత్రలో ప్రభాస్ నెక్ట్స్ రేంజ్‌లో మెప్పించారని విష్ణుపై గౌరవం పెరిగింది అని ఓ నెటిజన్ స్పందించాడు.
విష్ణు మంచు కెరీర్‌లోనే కన్నప్ప మూవీ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడని, సినిమా చివరి 20 నిమిషాలు పీక్స్ అని మరో నెటిజన్ స్పందించారు. . కన్నప్ప సినిమాను తప్పకుండా చూడాలని కోరారు.
కన్నప్పలో విష్ణు తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. ప్రభాస్ గంభీరమైన వాయిస్‌తో మనల్ని మరిపించేస్తాడు. మోహన్ లాల్ గారు గెస్ట్ పాత్రే అయినా తనదైన శైలిలో చేశాడని అంటున్నారు. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని, సీన్స్‌ని బీజీఎం హైలైట్ చేస్తుందని అన్నారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంటే, సెకండాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత గంట పాటు సాగే మూవీలో ప్రభాస్ సెటిల్డ్ గా పెర్ఫామెన్స్ చేశారు. సినిమాను విష్ణు చాలా గ్రాండియర్ గా చేశాడని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.
కన్నప్ప ఫస్టాఫ్ యావరేజ్.. సెకండాఫ్ పీక్స్ అంటూ ఓ నెటిజన్ చెప్పాడు. ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా నలబై నిమిషాలు పాటు ఫీస్ట్ లా ఉంటుందని చెప్పాడు. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు.