Kannappa Movie – Vishnu Manchu: ‘పవన్ కళ్యాణ్ నటుడిగా తనకు సీనియర్ అని, ఆయన నుంచి ప్రశంసలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నా’నని అన్నారు హీరో విష్ణు మంచు. ఈయన టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘కన్నప్ప’. జూన్27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘‘సెన్సార్ వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. నార్త్ వాళ్లకు తెలియదు. వారికి ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలను చూపించాల్సి వచ్చింది. అయితే ఆ సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు అంగీకరించలేదు. దాని కోనం నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సన్నివేశాలుంటే ఉత్తరాదిలో వివాదాలు వస్తాయని చెప్పారు. వారితో చర్చలు జరిపిన తర్వాత చిన్న మార్పులను చేయటంతో పాటు సంభాషణలను కూడా మార్చాం’’ అని అన్నారు. .
మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వేరు. ఈరోజు ఆయనపై రాష్ట్రం మొత్తం బాధ్యత ఉంది. కన్నప్ప సినిమా విడుదలైన వెంటనే సమయం తీసుకుని వెళ్లి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ను కలుస్తానని విష్ణు ఈ సందర్భంలో తెలిపారు. నెగెటివ్ రివ్యూస్ కావాలని, ఉద్దేశ పూర్వకంగా సినిమాపై చెడుగా రాస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, సినిమాను బతికించాలనేది తన ఉద్దేశమని, సినిమా రిలీజ్ కాకముందే కొందరు సినిమా బాగోలేదంటూ పోస్ట్స్ పెట్టారు. వారిని దృష్టిలో పెట్టుకునే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విష్ణు తెలిపారు.
కన్నప్ప ఓటీటీ డీల్ (OTT Deal) గురించి విష్ణు మాట్లాడుతూ ‘మంచి సినిమా అందించాలనేదే నా తపన. నేను పెట్టుకున్న రూల్ అదే. అందుకనే నా సినిమా విడుదలైన పది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలి. అందుకనే ఓటీటీ డీల్‌ను పక్కన పెట్టాను. రిలీజ్ ఒత్తిడి లేదు. భగవంతుడికి, భక్తుడికి మధ్య మధ్యవర్తులు, సాంప్రదాయలు, మూఢ నమ్మకాలు అవసరం లేదు. మనసారా దేవుడిని ప్రార్థిస్తే ఆయన మనకు దగ్గరవుతాడు అనే విషయాన్నే కన్నప్ప సినిమాతో చెప్పాలనుకున్నాను’ అని విష్ణు తెలిపారు.
మోహన్‌బాబు (Manchu Mohan Babu) నిర్మాతగా రూపొందిన కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రుద్ర పాత్రలో ప్రభాస్ (Prabhas), పరమేశ్వరుడి పాత్రలో అక్షయ్ కుమార్ (Akshay Kumar), పార్వతీదేవి పాత్రలో కాజోల్ అగర్వాల్ నటించగా, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), మోహన్ బాబు, శరత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.