మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwaksen) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila). రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు పాటలు విడుదల చేయగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తారనే వార్తలు హల్ చల్ చేశాయి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Vishwak-Sen-1-819x1024-1.webp)
తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ విశ్వక్ సేన్.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని ఆయన నివాసంలో కలిశారు. విశ్వక్‌తో పాటు నిర్మాత సాహు గారపాటి చిరంజీవిని కలిసి ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇందుకు చిరు కూడా అంగీకారం తెలిపినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మెగాస్టార్ – మాస్ కా దాస్ ఫోటోలు వైరల్ గా మారాయి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Vishwak-Sen-2-819x1024-1.webp)