Wednesday, March 26, 2025
Homeచిత్ర ప్రభVishwak Sen: మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకున్న విశ్వక్‌సేన్‌

Vishwak Sen: మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకున్న విశ్వక్‌సేన్‌

హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) నటించిన ‘లైలా’ (Laila) మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. విశ్వక్‌ వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కుమారుడు వల్లభనేని అనుదీప్ న్నారు కాగా విశ్వక్ సేన్ తొలిసారి లేడి గెటప్‌ పాత్ర పోషించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన ఈ సినిమానూ షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News