Sunday, October 20, 2024
Homeచిత్ర ప్రభMechanic Rocky: విశ్వక్‌సేన్ 'మెకానిక్ రాకీ' ట్రైలర్ చూశారా..? ఎలా ఉందంటే..?

Mechanic Rocky: విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ చూశారా..? ఎలా ఉందంటే..?

Mechanic Rocky| మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak Sen) వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా ‘మెకానిక్ రాకీ’. ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్, ‘గుంటూరుకారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లగా నలించారు. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, లిరికల్ సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు మూవీ మేకర్స్. ట్రైలర్‌లో విశ్వక్ యాక్టింగ్ అదిరిపోయింది. ట్రయాంగిల్ లవ్‌ స్టోరీతో మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా సినిమా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

- Advertisement -

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ సింజినీర్ అయిపోతా అన్న కొడుకు తెలివితేటలు చూసిన తండ్రి అతడితో ఓ మెకానిక్ షెడ్ ఓపెన్ చేయిస్తాడు. హీరో విశ్వక్ అక్కడ బండ్లు రిపేర్ చేస్తూనే.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పుతూ ఉంటాడు. ఈక్రమంలో ఒక హీరోయిన్ అతన్ని ప్రేమిస్తే.. మరో హీరోయిన్‌ను హీరో ప్రేమిస్తాడు. మరి ఈ ప్రేమకథల్లో ఎవరికి ఎవరు సెట్ అయ్యారో తెలియదు. ఇదిలా ఉండగానే హీరో గ్యారేజ్ కోసం విలన్ సునీల్ గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది.https://www.youtube.com/watch?v=ed2ppwARZy8&t=131s

ఈ నేపథ్యంలో విలన్ గ్యాంగ్ నుంచి తన షెడ్‌ను ఎలా కాపాడుకున్నాడు..? ఏ హీరోయిన్‌తో ముందుకు వెళ్తాడు అనేది తెరపై చూడాల్సిందే. ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాలో కొత్తదనం ఏమి కనిపించడం లేదు. రొటీన్ స్టోరీలాగే ఉంది. అయితే మాస్ ఆడియన్స్‌ టార్గెట్‌గా ఫైట్స్, డైలాగులు పెట్టినట్లు ఉన్నాయి. కొన్నిచోట్లు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. విశ్వక్ నటించిన గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. మరి ఈ సినిమాతో అయినా మనోడు హిట్ కొడతాడో లేదో తెలియాలంటే నవంబర్ 22వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News