నవంబర్ 7న ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ రిలీజ్
Vrushakarma First Single: యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేవిధంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు మేకర్స్ తెలియజేస్తూ…తాజాగా మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నట్లు చెప్పారు. ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ నవంబర్ 7న చిత్ర బృందం రిలీజ్ చేయనుంది.
దీనికి సంబంధించి విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు మరింత రఫ్ అండ్ రగ్గడ్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. అర్జున్ పాత్రలోని స్వాగ్, అటిట్యూడ్‌ను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఫస్ట్ సింగిల్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా సాధించింది.
ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఇందులో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

