Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభWaltair Veerayya Release Date : వాల్తేరు వీర‌య్య రిలీజ్ డేట్ ఫిక్స్‌

Waltair Veerayya Release Date : వాల్తేరు వీర‌య్య రిలీజ్ డేట్ ఫిక్స్‌

Waltair Veerayya Release Date : మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీర‌య్య’. కేఎస్ ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ క‌థానాయిక‌. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, బాబీసింహ‌, వెన్న‌ల కిశోర్‌, కేథ‌రిన్‌లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, ‘బాస్ పార్టీ’ సాంగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చారు. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 13న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి తాము సంక్రాంతి రేసులో ఉన్న‌ట్లు చిత్ర బృందం చెబుతూ వ‌స్తోంది. అయితే.. బాల‌య్య న‌టిస్తున్న ‘వీర‌సింహారెడ్డి’, ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న ‘వార‌సుడు’ చిత్రాలు జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ‘వాల్తేరు వీర‌య్య’ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో సంక్రాంతి బ‌రి నుంచి చిరు త‌ప్పుకున్నాడు అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. వాటికి చెక్ పెడుతూ చిత్ర బృందం నేడు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. సంక్రాంతి బ‌రిలో ఉన్న ఈ మూడు చిత్రాల్లో ఎవ‌రు సంక్రాంతి హీరో అనిపించుకుంటారో తెలుసుకోవ‌డానికి అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News