Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభWaltairVeerayya: నెల రోజుల్లో ‘బాస్ పార్టీ’ షురూ.. ప్రీమియర్స్‌కి సిద్ధమవుతున్న ‘వాల్తేరు వీరయ్య’

WaltairVeerayya: నెల రోజుల్లో ‘బాస్ పార్టీ’ షురూ.. ప్రీమియర్స్‌కి సిద్ధమవుతున్న ‘వాల్తేరు వీరయ్య’

WaltairVeerayya: సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ‘మాస్ మహారాజ్’ రవితేజ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. అంటే మరో నెల రోజుల్లో వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌కు సిద్ధమవుతోంది చిత్ర యూనిట్.

ఓవర్సీస్ పంపిణీ హక్కులు పొందిన శ్లోక ఎంటర్‌‌టైన్‌మెంట్‌ సంస్థ జనవరి 12నే నార్త్ అమెరికాతోపాటు అనేక లొకేషన్స్‌లో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తోంది. ఇతర దేశాల్లోనూ ముందుగానే ప్రీమియర్స్ పడతాయి. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ‘బాస్ పార్టీ’ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News