Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభNaga Chaitanya: నాగచైతన్య-శోభితా పెళ్లి కార్డు.. ఫొటోలు వైరల్

Naga Chaitanya: నాగచైతన్య-శోభితా పెళ్లి కార్డు.. ఫొటోలు వైరల్

Naga Chaitanya| అక్కినేని యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya), హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం నిశ్ఛితార్థం చేసుకున్న వీరి వివాహ వేడుకలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ప్రముఖులు, బంధువులు, సన్నిహితులకు వెడ్డింగ్ కార్డు(Wedding Card)లు పంపుతున్నారు.

- Advertisement -

ఈ వెడ్డింగ్ కార్డుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కార్డుతో పాటు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు పంపించారు. ఈ శుభలేఖలో వధువు, వరుడు తల్లిదండ్రులతో పాటు, తాతయ్య- బామ్మల పేర్లను కూడా చేర్చారు. మీరందరూ ప్రత్యేక ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని పేర్కొన్నారు.

ఇక చైతన్య సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన ‘తండేల్’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News