Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభSamantha: సమంతకు బిగ్ షాక్! వెబ్ సిరీస్ సంగతేంటి!

Samantha: సమంతకు బిగ్ షాక్! వెబ్ సిరీస్ సంగతేంటి!

Rakt Bramhand: ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారిన విషయం నటి సమంత కొత్త ప్రాజెక్టుల గురించి. ఇటీవల నిర్మాతగా మారి ‘శుభం’ సినిమాతో డీసెంట్ హిట్‌ కొట్టి సక్సెస్‌పుల్‌గా తన కొత్త ప్రయాణాన్ని ఆమె ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె టైటిల్ రోల్ పోషిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలను ఆమె చాలా సీక్రెట్ గా ఉంచుతోంది. నటి విషయానికి వస్తే ప్రస్తుతం సమంత చేస్తున్న ప్రాజెక్టుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రియేటర్స్ రాజ్ అండ్ డికె ఆధ్వర్యంలో ఈ సైంటిఫిక్ హారర్ డ్రామా రూపొందుతోంది. ఇందులో వామికా గబ్బి, ఆదిత్య రాయ్ కపూర్, ఆలీ ఫజల్ లాంటి క్రేజీ కాస్టింగ్ ఉండటంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. కానీ ఇప్పుడు ఈ సిరీస్ ఆగిందంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఇది సమంతకు బిగ్ షాక్ అనే చెప్పాలి.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ ‘రక్త్ బ్రహ్మాండ్’ కోసం దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఒక నెల రోజుల షూటింగ్ కూడా సక్సెస్ ఫుల్‌గా జరిగింది. కానీ, ఇక్కడే ఓ మెగా ట్విస్ట్ ఎదురైంది. సంస్థకు చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన ఒక స్కామ్ వల్ల నెట్‌ఫ్లిక్స్ కు భారీ నష్టం వాటిల్లిందట. దీంతో, కొంతకాలం షూటింగ్‌ను ఆపేసి, ఆడిటింగ్ మొదలుపెట్టారు. ఆడిటింగ్‌తో పాటు, స్క్రిప్ట్‌లో కూడా కొన్ని సమస్యలు తలెత్తాయని సమాచారం. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో, అప్పటిదాకా షూట్ చేసిందంతా వృథాగా మారే రిస్క్ వచ్చింది, . ‘తుంబడ్’ లాంటి క్లాసిక్ ని డైరెక్ట్ చేసిన రాహి అనిల్ బర్వే సైతం ఏమీ చేయలేక చేతులెత్తేశాడని టాక్. దీంతో మొత్తంగా ప్రాజెక్ట్‌లో అయోమయం నెలకొంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/nandamuri-balakrishna-repeating-directors-for-his-upcoming-movies/

ఇప్పటివరకు ఖర్చయిన మొత్తం సంగతేమోకానీ.. ఇకపై పెట్టబోయే పెట్టుబడి వల్ల లాభం లేదని నెట్‌ఫ్లిక్స్ గుర్తించిందని, అందుకే, ‘రక్త్ బ్రహ్మాండ్’ను క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, క్రియేటర్స్ రాజ్ అండ్ డికె మాత్రం ఈ బజ్ ను ఖండిస్తున్నారు. ‘అలాంటిదేమీ లేదు, జాప్యం జరిగినా త్వరలోనే రీస్టార్ట్ అవుతుంది’ అని తమ సన్నిహితులతో చెబుతున్నారట. వర్షాల వల్లనే లేట్ అవుతోందని, త్వరలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌తో రీ స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. కానీ, దీనికి కమిటైన ఇతర ఆర్టిస్టులు మాత్రం ఇప్పటికే తాము కమిట్ అయిన ఇతర సినిమాల షూటింగ్స్‌కి వెళ్లిపోయారు. హారర్ బ్యాక్‌డ్రాప్‌తో, క్రేజీ కంటెంట్‌తో రూపొందుతున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ ఆగిపోకూడదనేది సగటు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. అసలు ఈ బిగ్ డ్రామా ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి!.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News